OTTలోకి మరో థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ - తాప్సీ మరీ ఇంత రొమాంటిక్‌గా? అన్నీ ఆ సీన్లే!
ఓటీటీ మూవీ లవర్స్ ఎక్కువైపోయాక ఆయా సంస్థలు వారిని అస్సలు ఖాళీగా ఉంచట్లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంటెంట్లతో ముందుకొచ్చేస్తున్నాయి. ఖాళీ సమయం దొరకగానే లేదా వీకెండ్ రాగానే వాటిని చూస్తూ సినీ ప్రేమికులు ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా మరో మర్డర్ మిస్టరీ ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయింది. ఇందులో సొట్ట బుగ్గల సుందరి హీరోయిన్ తాప్సీ తన అందాలన్నింటినీ ఆరబోస్తూ నటించింది. లిప్ కిస్‌లతో, శృంగార సన్నివేశాలతో తనలోని రొమాంటిక్ యాంగిల్ మొత్తాని చూపిస్తూ కనిపించింది. ఇంతకీ ఈ చిత్రం ఏ ఓటీటీలోకి రాబోతుందో తెలుసుకుందాం..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్, కోలీవుడ్‌లో అంతగా రాణించలేకపోయినప్పటికీ బాలీవుడ్లో మాత్రం బాగానే వరుసగా సినిమాలు చేస్తోంది. అలానే సక్సెస్‌లను అందుకుంటోంది. ఆమె సినిమా అంటే వసూళ్లు మినిమమ్ గ్యారంటీ అంటూ నిర్మాతలు తనతో చిత్రాలు చేసేందుకు ముందుకొచ్చేస్తున్నారు. చష్మే బద్హూర్, బేబీ, పింక్, రన్నింగ్ షాది, నామ్ షబానా, దిల్ జుంగ్లీ, సూర్మ, ముల్క్ , బడ్లా, తప్పడ్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఆమెకు మంచి విజయాల్ని తెచ్చిపెట్టాయి.

రీసెంట్గా షారుక్ డంకీతో ప్రేక్షకుల్ని పలకరించిన ఈమె ఇప్పుడు మరో కొత్త క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్యే 12 ఫెయిల్ చిత్రంతో భారీ సక్సెస్‌ను అందుకున్న విక్రాంత్ మాస్సే ఈ చిత్రంలో నటించింది. ఈ సినిమా పేరు ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా. 2021లో థ్రిల్లింగ్ మర్డర్ మిస్టరీగా వచ్చి నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డ్ వ్యూస్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హసీన్ దిల్‌రుబా సీక్వెల్ ఇది. జయ్‌ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించాడు.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలై ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేసి మరింత హైప్‌ను పెంచారు. ఈ ప్రచార చిత్రంలో ఫస్ట్ పార్ట్ సినిమాలోని కథను మరోసారి చూపిస్తూ టీజర్‌ను ముందుకు తీసుకెళ్లారు. మర్డర్ మిస్టరీని లైట్‌గా చూపించారు. అలాగే తాప్సీని ఫుల్ రొమాంటిక్ మోడ్‌లో గ్లామర్‌గా చూపించారు. ఆమె ముద్దు, శృంగార సన్నివేశాలతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సన్నీ కౌశల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇకపోతే తాప్సీ ఈ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాల్లోనూ నటిస్తోంది. వో లడ్కీ హై కహాన్, ఖేల్ ఖేల్ మే సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అయితే వో లడ్కీ హై కహాన్‌లో ఏసీపీ కోమల్ శర్మగా తాప్సీ కనిపించనుంది.


Click it and Unblock the Notifications











