OTTని ఊపేస్తున్న మూడు సినిమాలివే.. టాప్ 2లో హనుమాన్.. మిగతా స్థానాల్లో ఏమున్నాయంటే?
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లు, సినీ తారలపై సర్వేలు చేస్తూ.. సరైన ఫలితాలను వెల్లడించే ఈ సంస్థ తాజాగా అదిరిపోయే సర్వే చేసింది. ప్రతీ వారం చేసే సర్వేనే అయినా ప్రస్తుతం టాప్ 3లో ఏయే సినిమాలు ఉన్నాయని తెలుసుకుంది. ఆ వివరాలను ఎక్స్ వేదికగా వెల్లడించింది. ముఖ్యంగా ఏప్రిల్ 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు టాప్ 3లో నిలిచిన సినిమాల జాబితాను విడుదల చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్మాక్స్ మీడియా సంస్థ చేసిన సర్వేలో టాప్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా చేసిన ఫైటర్ సినిమా నిలిచింది. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ వహించారు. అలాగే వయాకామ్ 18 స్టూడియోస్ మరియు మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్ గా నటించి మెప్పించింది.

హృతిక్ రోషన్, దీపికా పదుకొణే హీరోహీరోయిన్లుగా చేసిన ఈ సినిమాలో వీరు మాత్రమే కాకుండా ఫైటర్ చిత్రంలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, కరణ్ సింగ్ గ్రోవర్, ఆమిర్ నాయక్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో పోషించారు. జనవరి 25వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టుకుని సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అలా థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 21వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా టాప్ 1 ట్రెండింగ్ లో నిలిచిందీ చిత్రం.

ఇక రెండో స్థానంలో హనుమాన్ నిలిచింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో తేజా సజ్జా, అృతా అయ్యర్ లు హీరోహీరోయిన్లుగా చేశారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, దీపక్ రాజ్ శెట్టి, సముద్రతని, గెటప్ శ్రీనఉఖ, సత్య, భాను ప్రకాశ్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.
ఈ సినిమా థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసి బాక్సాఫీసును బద్ధలు చేసింది. ముఖ్యంగా ఎవరూ ఊహించని స్థాయిలో హిట్ కొట్టి షాక్ ఇచ్చింది. అలా ఓ ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా జియో సినిమా వేదికగా మార్చి 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.. ఎక్కువ మంది ఆసక్తిగా చూస్తున్నారు. చూసిన వాళ్లు కూడా ఈ సినిమాను చూస్తూనే ఉండడంతో టాప్ లో నిలుస్తోంది. ఇక టాప్ 3లో తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా నిలిచింది. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాకు అమిత్‌జోషి, ఆరాధనా సాహ్ దర్శకత్వం వహించారు.

ధర్మేంద్ర, డింపుల్ కపాడియా, షాహిద్ కపూర్, కృతి సనన్, రాకేష్ బేడీ, అనుభఆ ఫుతేపురియా, రాజేష్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 26వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. ఇలా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టుకున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఏప్రిల్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రాన్ని చూసేందుకు అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది.


Click it and Unblock the Notifications











