HanuMan OTT: మీ ఇంటికి 'హనుమాన్' వచ్చేస్తున్నాడు... ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ఎలాంటి అంచనాలు లేకుండా, అతి తక్కువ స్క్రీన్లు, యువ నటీనటులతో ఈ సంక్రాంతి బరిలో దిగిన సినిమా హనుమాన్. కానీ ఒక్కసారిగా అంచనాలను తారుమారు చేసేసింది. తనతో పాటు రిలీజైన బడా సినిమాలన్నిటినీ పక్కకు నెట్టేస్తూ రికార్డుల మీద రికార్డులతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో కూడా వస్తుందా? రెండో సారి చూద్దామా అంటూ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడా సస్పెన్స్‌ను తెరదించుతూ ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయిందీ చిత్రం. ఆ వివరాలను ఇప్పుడు స్టోరీలో చదివి తెలుసుకుందాం...
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా ఈ సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా 'హనుమాన్' ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిన విషయమే. అతి తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని రికార్డులు సృష్టించింది. చిన్న పెద్దా తేడా అని లేకుండా అందరూ థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది. ఓ పక్క సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోవైపు సీనియర్ హీరోలు వెంకీ, నాగ్ అలాంటి వారి చిత్రాల మధ్య సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ వారి చిత్రాలనే బీట్ చేసింది.

అసలీ చిత్రం రిలీజై దాదాపు 50 రోజులు పూర్తవుతున్నా ఇంకా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూనే ఉంది.ఇంకా నార్త్‌లోనూ పలు రికార్డులను క్రియేట్ చేసింది. ప్రభాస్, యశ్, రజనీకాంత్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రిషబ్ శెట్టి తర్వాత ఉత్తరాది రాష్ట్రంలో రూ.50 కోట్ల నెట్ వసూల్లు సాధించిన హీరోగా సజ్జా రికార్డుకెక్కాడు.
ఇప్పటివరకు రోబో 2, బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ , కేజీయఫ్ 2, కాంతార సినిమాలు మాత్రమే ఈ మార్క్‌ను అందుకున్నాయి. ఇప్పుడు హనుమాన్ ఆ రికార్డును అందుకుని వాటి సరనస చేరింది. ఇంకా ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లనే అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో ఎక్స్ పీరియెన్స్ చేసిన వాళ్లు మరోసారి కూడా థియేటర్లకు వెళ్లి చూశారు.
ఇక ఓటీటీలోనూ మరోసారి చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోసమే అదిరిపోయే గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే సంక్రాంతి సినిమాలు గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ ఓటీటీలోకి వచ్చేయగా ఇప్పుడు హనుమాన్ కూడా ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయిందని తెలిసింది. మార్చి 2 నుంచి ఓటీటీలోకి రాబోతున్నట్లు ఓటీటీ వర్గాల నుంచి సమాచారం అందింది.

అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ రావడం మాత్రం పక్కా అని అంటున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను జీ - 5 ఫ్లాట్ ఫామ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మరి థియేటర్లలో చూసిన వారు, చూడని వారు ఉంటే ఈ సినిమాను ఎంచక్కా మీ ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే ఓటీటీలో చూసి ఆస్వాదించేయండి.


Click it and Unblock the Notifications











