వికలాంగుడిని అందమైన డాక్టర్ పెళ్లాడితే, ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్.. ఎందులో, ఎప్పుడు?
ఈ మధ్యకాలంలో సినిమాలు అలా థియేటర్‌లో రిలీజ్ అవుతున్నాయో లేదో పట్టుమని వారం కూడా ఉండకుండానే ఓటీటీలోకి అడుగుపెట్టేస్తున్నాయి. ఆ మాత్రం దానికి డైరెక్ట్‌గా ఓటీటీలోకే అడుగుపెట్టేస్తే పోలా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాకపోతే థియేటర్‌లో స్క్రీన్‌పై మన బొమ్మ చూసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. థియేటర్‌లో హిట్ కానీ బొమ్మలు ఓటీటీలలో దుమ్ములేపిన ఉదంతాలు బోలెడు. తాజాగా ఓటీటీలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది ఉరుకు పటేలా మూవీ. ఈ వివరాల్లోకి వెళితే..
హుషారు మూవీతో యువతలో మంచి పేరు తెచ్చుకున్నాడు తేజస్ కంచర్ల. ఆయన రీసెంట్‌గా నటించిన చిత్రమే ఉరుకు పటేల. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. తేజస్, ఖుష్బూ చౌదరి, లావణ్య రెడ్డి, ఆనంద చక్రపాణి, చమ్మక్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. లీడ్ ఎడ్జ్ పిక్చర్స్‌పై కంచెర్ల బాల భాను నిర్మించిన ఈ సినిమాకు వివేక్ రెడ్డి దర్శకత్వం వహించారు.

నైజాం ఏరియాలోని జమీందార్ కుటుంబానికి చెందిన పటేల (తేజస్ కంచెర్ల) ఎలాంటి రెస్పాన్సిబులిటీస్ లేకుండా అందరికీ జీవితాన్ని ఇస్తానంటూ జులాయిగా తిరుగుతుంటాడు. అతని గురించి తెలిసి ఎవరూ కూడా పటేలను ప్రేమించరు. ఈ నేపథ్యంలో ఊళ్లో వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు వచ్చిన డాక్టర్ అక్షర (ఖుష్బూ చౌదరీ)ని ఇష్టపడతాడు పటేల. కానీ ఓ ప్రమాదం కారణంగా హీరోకి ఓ కాలు పనిచేయకుండా పోతుంది. అయినప్పటికీ పటేలను అక్షర పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. రెండు కుటుంబాల పెద్దలు కూడా పటేల, అక్షరకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ పటేలను చంపడానికి అక్షర తండ్రి (ఆనంద చక్రపాణి) పథకం రచిస్తాడు.
జమీందారి కుటుంబానికి చెందిన పటేల ఎందుకు జులాయిగా తిరుగుతాడు?చదువు సంధ్యలేని , అంగవికలుడైన పటేలను డాక్టర్ అక్షర ఎందుకు ఇష్టపడుతుంది? అక్షరకు పటేలతో ఆమె తండ్రి ఎందుకు పెళ్లి చేయాలని అనుకొంటాడు? పటేలను అక్షర తండ్రి ఎందుకు చంపాలని అనుకొంటాడు? హత్య నుంచి పటేల ఎలా తప్పించుకొన్నాడు? అక్షరను పటేల పెళ్లి చేసుకొన్నాడా? అక్షర పరిచయంతో పటేలలో వచ్చిన మార్పేంటీ? అన్నదే సినిమా కథ.
ఇలాంటి సబ్జెక్ట్స్‌తో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఫన్, థ్రిల్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఎక్కడా బోర్ కొట్టకుండా తీశాడు దర్శకుడు వివేక్. కానీ మధ్యలో ఎక్కడో లాజిక్ మిస్ అయినట్లుగా అనిపించడం మైనస్ పాయింట్. వినాయక చవితికే విజయ్ నటించిన గోట్, నివేదా థామస్ నటించిన 35 ఇది చిన్న కథ కాదు వంటి సినిమాలు రిలీజ్ కావడంతో ఉరుకు పటేల జనం దృష్టిలో పడలేదు. తాజాగా నెల గ్యాప్ తర్వాత ఓటీటీకి రంగం సిద్ధం చేసుకున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











