Telugu Indian Idol 2 ఆహా ఓటీటీలో శృతి నండూరి సంచలనం.. అద్బుతంగా రాణిస్తున్న ఎన్నారై డాక్టర్
దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన సంగీత కళాకారులను వెలికితీసే.. రియాలిటీ సో ఇండియన్ ఐడల్‌కు భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. అయితే తెలుగులో ఔత్సాహిక గాయకులను ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఇండియన్ ఐడల్ సీజన్ 1 భారీ స్పందనను కూడగట్టుకొన్నది. ఎంతో మంది ఔత్సాహిక గాయకులను, సంగీత కళాకారులను తెలుగు ప్రపంచానికి పరిచయం చేసింది. తొలి సీజన్ అందించిన ప్రోత్సాహం, ఉత్సాహంతో ఇండియన్ ఐడల్ 2 సీజన్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ షో వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండియన్ ఐడల్ 2లో
తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఆడియషన్స్ లెవెల్‌లోనే ఔత్సాహికులు సంచలనాలు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఇండియన్ ఐడల్‌లో ప్రవాసాంధ్రుల కుటుంబానికి చెందిన శృతి నండూరి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. శృతి నండూరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, ఆమె ప్రతిభను అందరూ గుర్తించారు. త్వరలోనే ఎన్నారై మ్యూజిక్ రంగంలో సెన్సేషన్ కావడం తథ్యం అంటున్నారు.

అమెరికా డాక్టర్ గాయనిగా
అమెరికాలోనే తెలుగు కుటంబానికి చెందిన శృతి నండూరి తన అద్బుతమైన గాన ప్రతిభతో అబ్బురపరుస్తున్నది. అమెరికాలో డాక్టర్‌గా వృత్తిని కొనసాగిస్తున్న శృతి.. ప్రవృత్తిగా గాయకురాలిగా అందరి మన్ననలను అందుకొంటున్నది. 70, 80 దశకంలో ఎంకి పాటలతో తెలుగు సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన నండూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన శృతి ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపైనే కాకుండా ఆహా ఓటీటీలో తన ప్రతిభను చాటుకొంటున్నది.

శ్రీరామరాజ్యం చిత్రంలోని పాటతో
ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ 2లో తన గాన మాధుర్యంతో సంచలనంగా మారింది. ఇటీవల శ్రీరామరాజ్యం చిత్రంలోని శ్రీరామ లేరా.. ఓ రామ లేరా అంటూ పాడిన పాట ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది. ఆహా వేదికపై ఆమె ఫెర్ఫార్మెన్స్‌పై సంగీత పండితులు, మ్యూజిక్ డైరెక్టర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. శృతి పాట పాడిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన సీట్ నుంచి లేచిపోయి.. సస్పెన్స్ క్రియేట్ చేశారు. తెలుగు ఇండియన్ ఐడల్ 2లో శృతి ఎపిసోడ్ ప్రతీ శుక్రవారం శనివారం 7గ గంటలకు ప్రసారం కానున్నది.
మెడిసిన్, మ్యూజిక్ కలిపి అంటూ
తాజా ప్రొమోలో శృతి నండూరి మాట్లాడుతూ.. నేను అమెరికాలో డాక్టర్‌ను. మెడిసిన్, మ్యూజిక్‌ను కలిపి ఓ ప్రయోగం చేయాలన్నదే నా కోరిక అని అన్నారు. అయితే శృతి సింగింగ్ టాలెంట్ చూసిన థమన్, గీతా మాధురి ఒకే చెప్పారు. గోల్డ్ కార్డు అందుకోమని చెప్పగానే.. మరో జడ్జీ అభ్యంతరం తెలిపారు. దాంతో ఒక్కసారి టికెట్ ఇచ్చిన తర్వాత మళ్లీ ప్రశ్నించే హక్కులేదు అంటూ నిరసన వ్యక్తం చేస్తూ తమన్ వెళ్లిపోయారు.


Click it and Unblock the Notifications











