Telugu Indian Idol 2 Winner ను ప్రకటించిన అల్లు అర్జున్. ఉత్కంఠగా జరిగిన ఫైనల్‌లో విజేత ఎవరంటే?
తెలుగు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొంటున్న మ్యూజికల్ సింగింగ్ రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్ 2. గత సీజన్ విజయవంతమవ్వడమే కాకుండా భారీగా రేటింగ్ సొంతం చేసుకోవడంతో అంతకు మించి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్‌ను భారీగా ప్రారంభించారు. కొద్దివారాలు ప్రతిభావంతులైన వర్థమాన గాయకులు నువ్వా? నేనా అనే విధంగా పోటీని రసవత్తరంగా మార్చారు. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరైన తెలుగు ఇండియన్ ఐడల్ 2 గ్రాండ్ ఫినాలేలో విజేతను ప్రకటించారు. ఆ విజేత వివరాల్లోకి వెళితే..
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 గ్రాండ్‌గా ముగిసింది. ఈ సీజన్‌లో నందమూరి బాలకృష్ణ, మెగా స్టార్ చిరంజీవి, ఇతర తెలుగు సినీ ప్రముఖులు ఈ షోను మరింత అందంగా మార్చారు. బాలకృష్ణ, చిరంజీవి లాంటి ప్రశంసలు అందుకొన్న యువ గాయకులు మరింత ఉత్సాహంతో ఫైనల్ రేసును కొనసాగించారు.

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 షోకు సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్, సింగర్స్ కార్తీక్, గీతా మాధురి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. యువ గాయకుల ప్రతిభను వెలికి తీయడానికి షోకు హోస్ట్‌గా వ్యవహరించిన మరో సింగర్ హేమచంద్ర తన వంతు సహకారం అందించారు. గాయకుడు హేమ చంద్ర తన చక్కటి హోస్టింగ్‌తో హృదయాలకు హత్తుకునేలా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
తెలుగు ఇండియన్ ఐడల్ 2 సీజన్ కోసం 10 వేల మందికిపైగా ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. దాదాపు 12 మంది యువ గాయకులు టైటిల్‌ను చేజిక్కించుకోవడానికి పోటీ పడ్డారు. ఈ పోటీలో చివరగా 5 మంది ఫైనల్‌కు చేరారు. న్యూ జెర్సీ నుంచి శ్రుతి, హైదరాబాద్ నుంచి జయరాం, సిద్ధిపేట నుంచి లాస్య ప్రియ, హైదరాబాద్ నుంచి కార్తీక్, విశాఖపట్నం నుంచి సౌజన్య భాగవతుల ఫైనల్‌కు చేరారు.

తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఫైనల్ ఎంతో ఉత్కంఠతతో నువ్వా నేనా అన్నట్టు కొనసాగించింది. పోటా పోటీగా జరిగిన ఫైనల్‌లో విశాఖపట్నంకు చెందిన సౌజన్య భాగవతుల విజేతగా నిలిచింది. అసాధారణమైన ప్రతిభను కనపరిచి ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. జయరాం, లాస్య ప్రియలు ఫస్ట్, సెకండ్ రన్నరప్‌లుగా నిలిచారు. జయరాం, లాస్య కూడా అద్భుతంగా పాడి శ్రోతలను అలరించారు.
తెలుగు ఇండియన్ ఐడల్ 2 సీజన్ ఫినాలెకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కావటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభిమానుల సమక్షంలో ఈ ఫినాలేను ఎంతో ఘనంగా నిర్వహించారు. అల్లు అర్జున్ ఈ సీజన్ 2 విజేతను ప్రకటించారు. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా ఆహాలో ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ 2 తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా మూడో సీజన్ ఎప్పుడా? అనే విధంగా ముగిసింది.


Click it and Unblock the Notifications











