Telugu Indian Idol: వాగ్దేవికి మాత్రమే కాదు.. వాళ్ళకు కూడా మంచి రెమ్యునరేషన్.. లక్కీ ఆఫర్స్!

తెలుగు ఇండియన్ ఐడల్ మెగా ఫైనల్ తో ప్రేక్షకులకు సరికొత్త కిక్కు ఇచ్చింది అనే చెప్పాలి. అసలు మొదట ఈ సింగింగ్ షో స్టార్ట్ అయినప్పుడు అంతగా సక్సెస్ అవ్వలేదు అని కూడా చాలామంది కామెంట్ చేశారు. కానీ ఫస్ట్ వీక్ లోనే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఇండియన్ ఐడల్ స్టార్ట్ అవుతుంది అనగానే రెండు రాష్ట్రాల నుంచి వందలాది మంది యువ సింగర్స్ పాల్గొనేందుకు ఆడిషన్స్ ఇచ్చారు. ఇక సీజన్ ఫైనల్ లో గెలిచిన వారు మాత్రమే కాకుండా మిగతా వారికి కూడా ఆహా నుంచి మంచి పారితోషికాలు అందాయి. అలాగే వారికి సినిమా అవకాశాలు కూడా దక్కినట్లు తెలుస్తోంది. ఇక ఎవరెవరికి ఎంత వచ్చింది అనే వివరాల్లోకి వెళితే..

 బిజీగా ఉన్నప్పటికీ..

బిజీగా ఉన్నప్పటికీ..


దేశవ్యాప్తంగా ఎంతగానో గుర్తింపును అందుకున్న ఇండియన్ ఐడల్ తెలుగులో మొదలవుతుంది అనగానే అసలు ఎలా ఉంటుంది అని వర్గం వారు ఎంతగానో ఆసక్తి చూపించారు. ఇక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ ప్రత్యేకమైన షో కోసం జడ్జిగా రావడం విశేషం. అలాగే మరొక ప్రముఖ నటి నిత్యా మీనన్ కూడా జడ్జిగా ఆకట్టుకున్నారు. ఇక ప్రముఖ సింగర్ శ్రీరామచంద్ర హోస్టింగ్ తో 30 ఎపిసోడ్స్ కూడా మంచి స్పందన లభించింది.

మెగాస్టార్ రాకతో..

మెగాస్టార్ రాకతో..

ఆహా నుంచి ఇప్పటివరకు ఎన్నో రియాలిటీ షోలు కామెడీ షోలు వచ్చాయి. అయితే అందులో తెలుగు ఇండియన్ ఐడల్ చాలా ఎక్కువ గుర్తింపు అందుకుంది. ఒక విధంగా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో ఆహా స్థాయి కూడా పెరిగింది అనే చెప్పాలి. ఇండియన్ ఐడల్ ను చూసేందుకు చాలా మంది ప్రేక్షకులు ఆహా అకౌంట్ కొనుగోలు చేసారు. ఇక ఫైనల్ లో మెగాస్టార్ రాకతో ఫైనల్ కు భారీ స్థాయిలో వ్యూవ్స్ వచ్చినట్లు సమాచారం.

వాగ్దేవికి 16 లక్షలు

వాగ్దేవికి 16 లక్షలు

ఇక ఇండియన్ ఐడల్ లో మొదటి స్థానంలో నిలిచి టైటిల్ను సొంతం చేసుకున్న వాగ్దేవికి సినిమా ఆఫర్స్ తో పాటు మంచి రెమ్యునరేషన్ కూడా దక్కింది. ఆమెకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా ఆఫర్ ఇచ్చినట్లు చెప్పకనే చెప్పేశారు. అంతే కాకుండా 10 లక్షల ప్రైజ్ మనీ కూడా దక్కింది. అంతేకాకుండా ఆహా స్పాన్సర్స్ నుంచి మరో ఆరు లక్షలు వచ్చాయి. అంటే మొత్తం 16 లక్షలు ఆమెకి లభించాయి.

 ఫస్ట్ రన్నరప్ కు కూడా..

ఫస్ట్ రన్నరప్ కు కూడా..

కేవలం వాగ్దేవికి మాత్రమే కాకుండా మిగతా వారు కూడా ఈ పోటీలో ఎంతగానో ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. ఇక ఈ సింగింగ్ షోలో ఫస్ట్ రన్నరప్ గా నిలిచిన శ్రీనివాస్ కు కూడా మంచి గుర్తింపు లభించింది. అతను కూడా చివరి వరకు చాలా గట్టిపోటీని ఇచ్చినప్పటికీ వాగ్దేవి ఫైనల్లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన తో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అయితే శ్రీనివాస్ కు మొత్తంగా స్పాన్సర్స్ నుంచి అలాగే ఆహా నుంచి పాల్గొన్నందుకు ఐదు లక్షల వరకు దక్కినట్లు తెలుస్తోంది. అలాగే అతనికి భవిష్యత్తులో థమన్ మ్యూజిక్ చేయబోయే సినిమాల్లో కూడా పాడే అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

రెండవ రన్నరప్..

రెండవ రన్నరప్..

ఇక రెండవ రన్నరప్ గా నిలిచిన వైష్ణవికి కూడా మెగాస్టార్ బోళా శంకర్ సినిమాలో పాడే అవకాశం కూడా దక్కింది. థమన్ సంగీతంలో ఆమె మొదటి సినిమా పాడే అవకాశం దక్కించుకొబోతోంది. ఇక ఆమె ప్రతిభకు మెచ్చి ఇండియన్ ఐడల్ అలాగే స్పాన్సర్ ద్వారా దాదాపు నాలుగు లక్షల వరకు దక్కినట్లు సమాచారం. ఇండియన్ ఐడల్ ద్వారా మొత్తానికి తెలుగులో ఎప్పుడు చూడని సరికొత్త సింగర్స్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నారు. మరి ఫ్యూచర్ లో వారు ఎంతగా ఆకట్టుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X