ఈవారం ఓటిటిలోకి కొత్త సినిమాలు... ఈ నాలుగు మాత్రమే తెలుగు మూవీస్ ,
వీకెండ్ గడిచిపోయింది. కొత్త వారంతో పాటు కొత్త మూవీస్ కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ ఫ్రైడే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా లాంటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో భారీ సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అయితే అందులో ఓ నాలుగు మాత్రమే ప్రత్యేకమని చెప్పాలి. ఈవారం మొత్తంగా 23 సినిమాలు సిరీస్ లు రిలీజ్ అవుతుంటే, అందులో నాలుగు మాత్రమే తెలుగు సినిమాలు ఉన్నాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.
1. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా నటించిన మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మే 31న థియేటర్లలో రిలీజ్ అయ్యి, పర్వాలేదు అనిపించింది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో రిలీజై రెండు వారాలు కూడా కాకముందే ఓటిటిలోకి అడుగు పెట్టడానికి సిద్ధమైంది. జూన్ 14న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కబోతోంది. జూన్ 14 నుంచి తెలుగుతో పాటే కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో కూడా ఒకేసారి స్ట్రిమింగ్ కానుంది.

2. యక్షిణి
ఇదొక మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. రాహుల్ విజయ్, వేదిక, మంచు లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ గురించి ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తేజ మార్ని దర్శకత్వం వహించిన యక్షిణి సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా, అది సిరీస్ పై అంచనాలు పెంచేసింది. యక్షిణి వెబ్ సిరీస్ జూన్ 14న డైరెక్టుగా డిస్నీ ప్లస్ హార్ట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
3. పారిజాత పర్వం
సునీల్, శ్రద్ధదాస్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన పారిజాత పర్వం సినిమా ఏప్రిల్ 19న థియేటర్లలోకి వచ్చింది. థియేటర్లలో రిలీజ్ అయిన దాదాపు రెండు నెలలకు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన పారిజాత పర్వం మూవీ జూన్ 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.

4. పరువు
నివేదా పెతురాజ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్ సిరీస్ పరువు జూన్ 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ లో మెగా బ్రదర్ నాగబాబు, బిందు మాధవి కీలక పాత్రలు పోషించారు. పరువు హత్యల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications











