Time Travel Movie: OTTలోకి వచ్చేసిన తెలుగు టైమ్ ట్రైవెల్ మూవీ... మిస్ అవ్వకండి!

రొటిన్ సినిమాలు చూసి బోర్ కొట్టిందా.. ఎప్పుడూ చూసిన క్రైమ్, థ్రిల్లర్, రొమాంటిక్, ఫ్యామిలీ మూవీస్ యేనా.. కొత్తగా ఏదైనా వస్తే బాగుండు అనుకంటున్నారా.. అయితే ఈ చిత్రం మీ కోసమే. ఓ టైమ్ ట్రావెల్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా తెలుగు మూవీ. తెలుగులో టైమ్ ట్రావెల్ మూవీ ఏంటా అని ఆలోచిస్తున్నారు. ఇటీవల థియేటర్లో రిలీజ్ అయి.. మంచి టాక్ అందుకున్న 7:11 PM మూవీ... ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అసలు ఈ చిత్రం కథేంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రొటిన్ కు భిన్నంగా మూవీస్ చూడాలి అనుకునే వారికి 7:11 PM కొత్త అనుభూతిని ఇస్తుంది. తెలుగులో సైన్స్ ఫిక్షన్, ట్రామ్ ట్రావెల్ జోనర్లలో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. ఇక బాలయ్య ఆదిత్య 369, సూర్య 24, ప్రశాంత్ వర్మ అ!, ఒకే ఒక జీవితం, బింబిసార వంటి సినిమాలు ఇదే కాన్సెప్టులో వచ్చి సూపర్ హిట్టుగా నిలిచాయి. ఆ మధ్య శింబు మానాడు పేరుతో ఓ మూవీ తీశాడు. అది కూడా టైం ట్రావెల్ కాన్సెప్టులోనే తెరకెక్కి సూపర్ హిట్టును అందుకుంది.

Telugu Time Travel Movie 7:11PM Streaming Now on Amazon Prime Video OTT

ఇక ఇటీవల కాలంలో టైం ట్రావెల్ కాన్సెప్టుతో తెరకెక్కిన చిత్రం 7:11 PM. ఇది జూలై 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చింది. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ రాగా... డిఫరెంట్ జోనర్ కోరుకునే ప్రేక్షకులకు మాత్రం బాగా నచ్చింది. ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పర్వాలేదనిపించింది. కొంతమందికి అంటే టైం ట్రావెల్ వంటి కథలను ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది.

Telugu Time Travel Movie 7:11PM Streaming Now on Amazon Prime Video OTT

ఇక ఈ 7:11 PM సినిమాలో ఆకట్టుకునే అంశాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాకు ప్రముఖ సినిమా రివ్యూ వెబ్ సైట్ ఐఎండీబీ కూడా దీనికి 7.5 రేటింగ్ ఇచ్చింది. ఇక జులై 7న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ... దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి సడెన్ గా ఎంటర్ అయింది. ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చి స్ట్రీమింగ్ అవుతుంది. సెప్టెంబర్ 9 అర్దరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

Telugu Time Travel Movie 7:11PM Streaming Now on Amazon Prime Video OTT

ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రస్తుతం 7:11 PM స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కొన్ని సినిమాలు థియేటర్లలో మంచి ఫలితం రాబట్టలేకున్నా... ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటాయి. అందులో ఇలాంటి టైమ్ ట్రావెల్ సినిమాల విషయంలో థియేటర్లలో చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ.... ఓటీటీలో క్లిక్ అవ్వొచ్చు.

ఇక 7:11 PM సినిమా విషయానికి వస్తే... చైతు మాదాల దర్శకత్వం వహించారు. ఆర్కస్ ఫిల్మ్స్ బ్యానర్‍ పై నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించారు. దీనికి గ్యాని సంగీతం అందించారు. మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. మూడు వేరు వేరు కాలాల్లో జరిగే సినిమాగా వచ్చిన 7:11 PMలో సాహస్ పగడాల, దీపికా రెడ్డి, డాక్టర్ భరత్ రెడ్డి, టెస్ వాల్ష్, రఘు కారుమంచి, చరణ్ కురుగొండ, రైజింగ్ రాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మీరు కనుగ టైం ట్రావెల్ సినిమాలు ఇష్టపడితే ఈ సినిమాను ఓటీటీలో ఓసారి చూసేయొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X