OTT: ఓటిటిలోకి సరిపోదా శనివారం..ఎప్పుడు? ఎక్కడ? స్ట్రీమింగ్ అంటే?
ఈ ఏడాదిలో తెలుగు సినిమా నుంచి కొంచెం పెద్ద హిట్ సినిమాలు ఏమన్నా ఉన్నాయి అనేది చూస్తే అవి తక్కువే ఉంటాయని చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ హిట్స్ తో థియేటర్స్ లో జనాలు, ఒక టైం లో థియేటర్స్ కి రాకుండా ఉన్న పరిస్థితులు కూడా ఈ ఏడాదిలోనే కనిపించాయి. మరి ఇలాంటి డ్రై వాతావరణంలో వచ్చి జనాన్ని థియేటర్స్ కి రప్పించిన సినిమాలు మాత్రం కొన్నే అని చెప్పాలి.
అలా ఈ ఏడాది ఫస్టాఫ్ లో హను మాన్, కల్కి 2898 ఎడి అనే పాన్ ఇండియా సినిమాలు చూసుకుంటే.. మళ్ళీ వీటి తర్వాత 2024 సెకండాఫ్ లో టాలీవుడ్ నుంచి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా భారీ రన్ తో అదరగొట్టింది. మరి ఆ సినిమానే నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం "సరిపోదా శనివారం". దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమాగా అదరగొట్టింది.

కాగా ఈ చిత్రం రన్ ఎలా ఉందంటే వర్షాలని సైతం తట్టుకొని భారీ వసూళ్లు కొల్లగొట్టగా ఇంత బాగా రన్ అవుతున్న ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై ట్విస్ట్ ఇపుడు వినిపిస్తుంది. కాగా ఈ మధ్య కాలంలో పలు చిత్రాలు హిట్ అయ్యిన కాకపోయినా నెల రోజుల్లోపే ఓటిటిలో వచ్చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఇప్పుడు సరిపోదా శనివారం కి ఆ సినిమాల కంటే బెటర్ పెర్ఫామెన్స్ దక్కినప్పటికీ ఈ చిత్రం కూడా నెల లోపే ఓటిటిలో సందడి చేసేందుకు వస్తుంది అని స్ట్రాంగ్ గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రం థియేటర్స్ లో ఈ ఆగస్ట్ 29న పాన్ ఇండియా భాషల్లో విడుదల అయితే ఇప్పుడు ఓటిటిలో నెల లోపే అంటే ఈ సెప్టెంబర్ 27నే ఓటిటిలో వచ్చేస్తుంది అని వినిపిస్తుంది.

కాగా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని వరల్డ్ పాపులర్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులోనే ఈ సెప్టెంబర్ 27న వచ్చేస్తుంది అని ఇప్పుడు గట్టి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంకా ఇదే డేట్ ని నెట్ ఫ్లిక్స్ సెప్టెంబర్ మూడో వారంలో అలా అనౌన్స్ చేయనున్నారట. సో సరిపోదా శనివారం ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్నవారు అయితే ఇంకొన్ని వారాలు ఆగితే సరిపోతుంది అని చెప్పాలి.
మరి ఈ చిత్రంలో నాని సరసన యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. మరి తెలుగులో ఆల్రెడీ నానితో "గ్యాంగ్ లీడర్" లో నటించగా ఇది రెండో సినిమాగా వచ్చింది. ఇంకా ఈ సినిమాలో తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ గా నటించగా ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అన్నట్టు ఈ చిత్రానికి సంగీతం అందించిన జేక్స్ బిజోయ్ వర్క్ కి సినిమా రిలీజ్ తర్వాత సెన్సేషనల్ రెస్పాన్స్ కూడా వచ్చింది.


Click it and Unblock the Notifications











