Stree 2 on OTT: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న స్త్రీ 2 ఓటీటీలోకి.. లేడీ హారర్ థ్రిల్లర్ ఎప్పుడు స్ట్రీమింగ్?
దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో కూడా మేల్ డామినేషన్ నే ఎక్కువ ఉంటుంది అని అందరికీ తెలిసిందే. కానీ చిన్న చేంజ్ తో అలాంటి డామినేషన్ ఉన్నా కూడా కొందరు హీరోయిన్స్ ఆ హీరోలకి ధీటుగా సోలో మూవీస్ చేసి అదరగొడతారు. అలా మన తెలుగులో స్వీటీ అనుష్క, కాజల్ అలాగే స్టేర్ బ్యూటీ సమంతలు ఉన్నారు. ఇక తమిళ్ నుంచి అయితే నయనతార, త్రిష లాంటి స్టార్స్ ఉన్నారు.
మరి సౌత్ సైడ్ ఓకే నార్త్ వైపు పరిస్థితి ఏంటి అనేది కూడా చూస్తే.. అక్కడ కూడా స్టార్ హీరోలకి ధీటుగా సాలిడ్ పెర్ఫామెన్స్ సహా మార్కెట్ ఉన్న హీరోయిన్స్ లేకపోలేరు. అయితే ఒకప్పుడు కంటే ఇప్పుడు మార్కెట్ లెక్కలు మారిపోయాయి. సోలోగా ఓ హీరోయిన్ సినిమా వచ్చి పెద్ద హిట్ అవ్వాలి అందులోని స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో 500 కోట్ల మార్క్ ని అందుకోవాలి అంటే అది ఏ హీరోయిన్ సినిమాకి అయినా కొంచెం కష్టమే అని చెప్పాలి.

కానీ సరైన సినిమా పడితే అది ఈజీగా ఈ మార్క్ ని చేస్తుంది అని బాలీవుడ్ సినిమా దగ్గర రీసెంట్ గా వచ్చిన భారీ హిట్ చిత్రం "స్త్రీ 2" ప్రూవ్ చేసింది. ప్రభాస్ తో "సాహో" సినిమాలో కనిపించిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ మెయిన్ లీడ్ గా టాలెంటెడ్ నటులు రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ ఓపెనింగ్ రోజుకే రికార్డు ఓపెనింగ్స్ అందుకొని ట్రేడ్ ని షాక్ కి గురి చేసింది.
ఇలా బాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ సినిమాల లిస్ట్ లో చేరేందుకు ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. కాగా ఈ సినిమా ఆల్రెడీ 500 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ ని దాటేయగా ఇప్పుడు బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ షారుక్ ఖాన్ నటించిన "జవాన్" ఫైనల్ వసూళ్లపై కన్నేసింది. మరి ఈ రేంజ్ లో సంచలనం రేపిన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై కూడా గట్టి క్రేజ్ ఉంటుంది.

కాగా ఇప్పుడు కొని రూమర్స్ స్త్రీ 2 ఓటిటి రిలీజ్ పై వినిపిస్తున్నాయి. దీనితో ఈ సినిమా ఈ సెప్టెంబర్ 27 నుంచి ఓటిటి లో ప్రసారం కానున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ని నోటెడ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చేయగా అందులో ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 27 నుంచి వచ్చేస్తుంది అని టాక్. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
అప్పటికి ఎలాగో సినిమా లాంగ్ రన్ కూడా అయ్యిపోవస్తుంది కాబట్టి ఇదే డేట్ లో సినిమా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ కూడా చేయగా ఈ చిత్రాన్ని దర్శకుడు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమా 2018 లో వచ్చిన "స్త్రీ" కి సీక్వెల్ గా వచ్చింది.


Click it and Unblock the Notifications











