Thaai Kizhavi OTT: 80 కోట్ల వసూళ్లతో రాధిక సంచలనం.. తాయ్ కెలవి ఏ ఓటీటీలో? స్ట్రీమింగ్ ఎప్పుడంటే

స్టార్లు, సూపర్‌స్టార్ల సినిమాలే బొక్క బోర్లా పడుతూ.. భారీ నష్టాలను తీసుకొస్తున్న దశలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అదరగొట్టారు సినీయర్ నటి రాధికా శరత్ కుమార్. 63 ఏళ్ల వయసులో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించారు. రాధిక నటన, కామెడీ, గ్రామీణ వాతావరణం, కథకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ ఏడాది తమిళ చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ హిట్ తాయ్ కెలవి కావడం విశేషం.

ఈ సినిమాలో వృద్ధురాలి గెటప్ కోసం రాధిక ఎంతో శ్రమించారట. మేకప్ వేసుకునేందుకు 5 గంటలు, తీసేందుకు 2 గంటలు పట్టేదట. ఈ వయసులోనూ అంతటి కష్టంతో.. సినిమాపై తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు రాధిక. మరి అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

Thaai Kizhavi OTT release Radikaa Sarathkumar s film gets OTT streaming date

శివకార్తీకేయన్ ప్రొడక్షన్స్, పాషన్ స్టూడియోస్ బ్యానర్‌లపై కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్, సుధాన్ సుందరం సంయుక్తంగా తాయ్ కెలవి చిత్రాన్ని నిర్మించారు. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. సింగమ్ పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, ఇళవరసు, మునిష్‌కాంత్, జార్జ్ మార్యాన్, వెట్టై ముత్తుకుమార్, రాయ్‌చల్ రెబాక తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాయ్ కెలవి మూవీకి వివేక్ విజయ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా, సాన్ లోకేష్ ఎడిటర్‌గా పనిచేశారు. నివాస్ కే ప్రసన్న ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 27వ తేదీన తాయ్ కెలవి మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

తాయ్ కెలవి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి తాయ్ కెలవి మూవీని 9 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలపరంగా నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు, రగ్గడ్ లుక్‌లో రాధిక లుక్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాయ్ కెలవి మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల రూపాయల షేర్.. 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా 450కి పైగా థియేటర్‌లలో విడుదల చేశారు.

తాయ్ కెలవి కలెక్షన్స్
తాయ్ కెలవి మూవీకి తొలి వారం 23.95 కోట్ల రూపాయలు, రెండో వారం 20 కోట్ల రూపాయలు, మూడో వారం 11.92 కోట్ల రూపాయలు, నాలుగో వారంలో 4.16 కోట్ల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు ఇండియాలో 61.34 కోట్ల రూపాయల నెట్.. 70.26 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లోనూ తాయ్ కెలవి మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. నార్త్ అమెరికా, యూకే, యూరప్, సింగపూర్, మలేషియా తదితర దేశాలలో కలిపి ఓవర్సీస్‌లో రాధిక శరత్ కుమార్ మూవీకి 10.35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 80.16 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైనట్లు సాక్‌నిక్ నివేదించింది.

తాయ్ కెలవి ఏ ఓటీటీలో?
రాధిక శరత్ కుమార్ నటించిన తాయ్ కెలవి స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. థియేటర్‌లలో విడుదలైన 6 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే నిబంధన ప్రకారం డీల్ కుదిరింది. దాంతో తాయ్ కెలవిని ఏప్రిల్ 10 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల చేస్తున్నట్లు జియో హాట్ స్టార్ ప్రకటించింది. మరి థియేటర్‌లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X