Thaai Kizhavi OTT: రికార్డ్ వసూళ్లతో తాయ్ కెలవి సంచలనం.. రాధికా శరత్ కుమార్ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

తమిళ సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ నటించిన తాయ్ కెలవి మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. భారీ వసూళ్లతో ఈ చిత్రం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. కామెడీ, ఫ్యామిలీ, గ్రామీణ వాతావరణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ ఉండటంతో కాసుల పంట పండిస్తోంది. ఈ నేపథ్యంలో తాయ్ కెలవి మూవీ ఓటీటీ రిలీజ్‌పై డిస్కషన్ మొదలైంది. ఈ నేపథ్యంలో రాధికా శరత్ కుమార్ మూవీని ఏ ఓటీటీ ఫ్లాట్‌ఫాం దక్కించుకుంది? స్ట్రీమింగ్ ఎప్పుడు? అనేది పరిశీలిస్తే..

శివకార్తీకేయన్ ప్రొడక్షన్స్, పాషన్ స్టూడియోస్ బ్యానర్‌లపై కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్, సుధాన్ సుందరం సంయుక్తంగా తాయ్ కెలవి చిత్రాన్ని నిర్మించారు. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. సింగమ్ పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, ఇళవరసు, మునిష్‌కాంత్, జార్జ్ మార్యాన్, వెట్టై ముత్తుకుమార్, రాయ్‌చల్ రెబాక తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాయ్ కెలవి మూవీకి వివేక్ విజయ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా, సాన్ లోకేష్ ఎడిటర్‌గా పనిచేశారు. నివాస్ కే ప్రసన్న ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 27వ తేదీన తాయ్ కెలవి మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Thaai Kizhavi OTT Release When And Where To Watch Radhika Sarathkumar s Movie Online After Theatrical Run

తాయ్ కెలవి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి తాయ్ కెలవి మూవీని 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలపరంగా నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు, రగ్గడ్ లుక్‌లో రాధిక లుక్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాయ్ కెలవి మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 11 కోట్ల రూపాయల షేర్.. 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా 450కి పైగా థియేటర్‌లలో విడుదల చేశారు.

తాయ్ కెలవి కలెక్షన్స్
రాధికా శరత్ కుమార్ మూవీకి తొలిరోజున 2.65 కోట్ల రూపాయలు, రెండో రోజున 5 కోట్ల రూపాయలు, మూడో రోజున 6.15 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 2.85 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది. తద్వారా ఇండియాలో నాలుగు రోజుల వరకు 16.65 కోట్ల రూపాయల నెట్.. 19.65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటి వరకు తాయ్ కెలవి మూవీ కర్ణాటకలో 1.50 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 19 లక్షల రూపాయలు, తమిళనాడులో 17.7 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 26 లక్షల రూపాయలు చొప్పున గ్రాస్ రాబట్టింది. అలాగే ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 6 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో కేవలం 4 రోజుల్లోనే 25 కోట్ల రూపాయలకు పైగా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. వర్కింగ్ డేస్ మొదలైనా, తమిళనాడులో పరీక్షల సీజన్ నడుస్తున్నా ఈ సినిమాకు వసూళ్లు మాత్రం తగ్గడం లేదు. ఐదో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 3 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాంతో తాయ్ కెలవి మూవీ 28 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు.

తాయ్ కెలవి ఓటీటీ డీటెయిల్స్
తాయ్ కెలవి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ డీల్ ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. థియేటర్‌లలో రిలీజైన 4 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలనే నిబంధన మేరకు డీల్ కుదిరినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి థాయ్ కెలవి మూవీ మార్చి చివరి వారంలో ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ ఆలస్యం కావొచ్చు.. మరింత ముందుకు జరగొచ్చు. తాయ్ కెలవి మూవీ ఓటీటీ రిలీజ్‌పై జియ్ హాట్‌స్టార్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X