Thalaivan Thalaivii OTT: ఓటీటీలోకి తలైవన్ తలైవి.. విజయ్ సేతుపతి మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మక్కల్ సెల్వన్‌గా, విలక్షణ నటుడిగా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నారు విజయ్ సేతుపతి. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అభిమానులు ఖచ్చితంగా అందులో ఏదో ఒక విశేషం ఉందని నమ్ముతారు. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు విజయ్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తారు సేతుపతి. తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన చిత్రాలకు భారీ క్రేజ్ ఉంది. కోలీవుడ్‌ను దాటి తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఆయన సినిమాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా విజయ్ నటించిన చిత్రం తలైవన్ తలైవి. సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ ఇందులో విజయ్ సేతుపతికి హీరోయిన్‌గా నటించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈసారి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో
సత్య జ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై ఈ సినిమాను సెంథిల్ త్యాగరాజన్, అరుణ్ త్యాగరాజన్, టీజీ త్యాగరాజన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో యోగిబాబు, రోషిణి హరిప్రియన్, కాళి వెంకట్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎం సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రదీప్ ఈ రాఘవన్ ఎడిటింగ్ .. సంతోష్ నారాయణ్ సంగీత సారథ్యం వహించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా జూలై 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Thalaivan Thalaivii OTT Release When And Where To Watch Vijay Sethupathi s Movie Online After Theatrical Run

తలైవన్ తలైవి బడ్జెట్ ఎంత?
పూర్తిగా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ హోటల్, భార్యాభర్తల మధ్య తలైవన్ తలైవి చిత్రం నడుస్తుంది. ప్రేక్షకులకు సినిమాటిక్ అనుభూతిని కలిగించిన సహజమైన లోకేషన్స్‌లో ఈ సినిమాను చిత్రీకరించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాల ఖర్చు కలిపి తలైవన్ తలైవి చిత్రానికి దాదాపు 30 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

తలైవన్ తలైవిపై భారీ అంచనాలు
విజయ్ సేతుపతి- నిత్యామీనన్ కాంబినేషన్‌కు తోడు టీజర్, ట్రైలర్లు, పాటలతో తలైవన్ తలైవి చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహారాజా చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆయనకు ఫాలోయింగ్, మార్కెట్ పరిధి కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో తలైవన్ తలైవి మూవీకి తమిళం, తెలుగు, ఓవర్సీస్‌లో మంచి బిజినెస్ చేసింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌కు పోటీ నెలకొంది. తలైవన్ తలైవి సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను విజయ్ టీవీ, కలర్స్ తమిళ్ సొంతం చేసుకున్నాయి.

తలైవన్ తలైవి ఏ ఓటీటీలో?
తలైవన్ తలైవి సినిమా చిత్రం ఈ రోజు రిలీజ్ కాగా.. అప్పుడే ఈ సినిమా ఏ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటూ విజయ్ సేతుపతి అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో థియేటర్లలో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ లెక్కన ఆగస్ట్ చివరి వారంలో తలైవన్ తలైవి చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే థియేట్రికల్ బిజినెస్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ ఆలస్యం కావొచ్చు.. నెల లోపే స్ట్రీమింగ్‌లోకి రావొచ్చు. తలైవన్ తలైవి ఓటీటీ రిలీజ్‌పై ప్రైమ్ వీడియోస్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X