OTT: ఓటీటీలోకి 400 కోట్ల విజయ్ సినిమా.. దళపతి మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు? స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఒక స్టార్ హీరో తాలూకా పవర్ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ హీరో సినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు కొల్లగొడితే అప్పుడే అని చెప్పాలి. అయితే సాధారణంగా ఇలాంటి హీరోలు చాలా అరుదుగానే ఉంటారు. ఇప్పుడు ఉన్న టైం లో అయితే ఎంత పెద్ద హీరో అయినా కూడా డిజాస్టర్ టాక్ తో 100 కోట్ల గ్రాస్ ని అందుకోవడమే కష్టంగా ఉంటుంది.
కానీ అలాంటి ఒక మిక్స్డ్ అండ్ డిజాస్టర్ టాక్ తో ఏకంగా 400 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న హీరోగా విజయ్ దళపతి నిలిచాడు అని చెప్పాలి. కాగా తమిళ నాట భారీ క్రేజ్ విజయ్ కి సొంతం ఇందుకే తనతో ఎలాంటి నిర్మాత అయినా భారీ రెమ్యునరేషన్ ని అడిగినా కూడా చేసేందుకు రెడీ అంటారు. అలాంటి మార్కెట్ ఇప్పుడు విజయ్ సొంతం అయ్యింది.

కాగా ఇప్పుడు విజయ్ నటించిన లేటెస్ట్ భారీ చిత్రమే "ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం". కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించగా విజయ్ హీరోగా విలన్ గా కూడా తానే చేసాడు. అయితే ఇది కేవలం విజయ్ ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పించగలిగింది కానీ ఇతర ఆడియెన్స్ కి అంత ఎక్కలేదు. దీనితో ఒక్క తమిళ్ వెర్షన్ తప్ప మిగతా భాషలు అన్నిటిలో కూడా డిజాస్టర్ గానే మిగిలింది.
అయినప్పటికీ ఈ సినిమాతో విజయ్ ఏకంగా 410 కోట్లకి పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ ని కొల్లగొట్టి తన క్రేజ్ చూపించాడు. కాగా ఈ సినిమా థియేటర్స్ లో వచ్చిన స్టార్టింగ్ లోనే ఎప్పుడు ఓటిటిలో ఎప్పుడు విడుదల అవుతుంది అనేది కూడా బయటకి వచ్చింది. కాగా ఓటిటి వెర్షన్ లో డైరెక్టర్ కట్ తో రాబోతుంది అని అలాగే ఇది ఏకంగా 3 గంటల 40 నిమిషాలకి పైగా ఉంటుంది అని కూడా కన్ఫర్మ్ అయ్యింది.

అయితే గోట్ సినిమా నిజానికి నెల లోపే వచ్చేస్తుంది అని టాక్ వచ్చింది. ఆ మధ్య టాక్ వచ్చింది. ఇప్పుడు అనుకున్నట్టుగానే ఈ డిజాస్టర్ సినిమా తాలూకా ఓటిటి డేట్ అయితే రివీల్ అయ్యిపోయింది. కాగా ఈ చిత్రాన్ని పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ డీల్ తో సొంతం చేసుకోగా ఈ అక్టోబర్ 3 నుంచే సినిమా అందులో వచ్చేస్తున్నట్టుగా బ్రేకింగ్ అప్డేట్ ని అయితే ఇప్పుడు ఇచ్చేసారు. టోటల్ పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా ఆరోజు నుంచి అందుబాటులో ఉండనుందట.
కాగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అప్పుడు అనుకున్నట్టుగా డైరెక్టర్ కట్ వెర్షన్ లో వస్తుందా లేక థియేట్రికల్ వెర్షన్ వస్తుందా అనేది మాత్రం ఈ అక్టోబర్ 3 వరకు ఆగి చూస్తే తెలిసిపోతుంది. ఇంకా ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి, స్నేహ హీరోయిన్స్ గా నటించగా త్రిష ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. అలాగే యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అలాగే విజయ్ 68వ సినిమాగా ఏజిఎస్ సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











