OTTలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం లియో. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన అందాల తార త్రిషా కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రం ఈ దసరా కానుకగా లియో చిత్రం అక్టోబర్ 19వ తేదీన థియేటర్లోకి వచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేంది. అయితే ఈ సినిమా డిజిటల్ ప్రిమియర్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఇక ఈ సినిమా ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.. ఎప్పుడు కానుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తమిళ సూపర్ స్టార్ విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం లియో. ఇక ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, సౌత్ స్టార్ హీరో అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, మడొన్నా సెబాస్టియన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దాదాపు 300 కోట్ల రూపాయలతో సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్ కుమార్, జగదీశ్ పళనిస్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Thalapathy Vijay Director Lokesh Kanagaraj Leo Movie Going To Streaming on Netflix OTT From Nov 26th

ఇక లియో సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం అయితే కురిపిస్తోంది. సినిమా రిలీజ్ అయి వారం రోజులు కావొస్తున్నా.. కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. సినీ ఇండస్ట్రీలోని రికార్డులను లియో బ్రేక్ చేస్తూ వెళ్తుంది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం హైలెట్ అవ్వగా... లోకేష్ కనగరాజ్ టేకింగ్.. విక్రమ్, ఖైదీ సినిమాలకు కనెక్షన్ పెట్టడం సినిమాకు ప్లస్ గా మారింది. ఇక ఈ సినిమా వారం రోజుల్లోనే 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది.

Thalapathy Vijay Director Lokesh Kanagaraj Leo Movie Going To Streaming on Netflix OTT From Nov 26th

ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి రానుందని సమాచారం. లియో సినిమా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ అియిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రానుందట. లియో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం బయటకు వచ్చింది.

విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన లియో సినిమా.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందట. నవంబర్ 21వ తేదీన లియో సినిమా ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయం సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. లియో ఓటీటీ రిలీజ్ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రిలీజ్ చేయలేదు. దాదాపు నవంబర్ లోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

Thalapathy Vijay Director Lokesh Kanagaraj Leo Movie Going To Streaming on Netflix OTT From Nov 26th

ఇక లియో సినిమా విషయానికి వస్తే.. విజయ్ నటన, యాక్షన్ సీన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విధానం... ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. ఇక ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయితే... ఓటీటీలో ఎంచాక్క ఇంట్లోనే చూసేయండి. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ను మిస్ అవ్వకండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X