OTTలోకి రీసెంట్ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి ప్రతి వీకెండ్ కొత్త సినిమాలు రావడం కామన్. ఎప్పటి నుంచో ఓటీటీలో వస్తుందంటూ ఊరించిన సినిమా.. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లియో. ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే టీమ్ షాక్ ఇస్తూ.. కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఇక ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అవ్వబోతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరైన దళపతి విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం లియో. విజయ్ కు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. దళపతి విజయ్ నటించిన సినిమాలన్ని తెలుగులోకి డబ్ అయ్యి సూపర్ హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన సంక్రాంతికి వారసుడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇక ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది.

Thalapathy Vijay Lokesh Kanagaraj Leo Movie Going To Streaming on Netflix OTT From Nov 21st Full Details Here

ఇక వారసుడు సక్సెస్ తర్వాత విజయ్... లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో త్రిష.. విజయ్ సరసన నటించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత విజయ్.. త్రిషతో జోడి కట్టింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‏లో భాగంగా వచ్చిన ఈ లియో సినిమా... విజయ్ కెరీర్‏ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదలై.. ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్టుగా నిలిచింది.

లియో సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.550 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నవంబర్ 17న రిలీజ్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై అనేక ప్రచారాలు సాగాయి. ఈరోజు రిలీజ్ అవుతుందని అనుకున్న నేపథ్యంలో... లియో టీమ్ షాక్ ఇచ్చింది.

Thalapathy Vijay Lokesh Kanagaraj Leo Movie Going To Streaming on Netflix OTT From Nov 21st Full Details Here

తాజాగా లియో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అధికారికంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ సినిమాను డిజిటల్ ప్రిమియర్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. ఇక లియో సినిమాను నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. నవంబర్ 21వ తేదీన లియో సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మీరు ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయితే.. ఓటీటీలో చూసేయండి.

ఇక నెట్ ఫ్లిక్స్ నవంబర్ లో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టును కూడా రిలీజ్ చేసింది. నవంబర్ 17న Scott pilgrim takes off G.I.Joe, నవంబర్ 18న ది రైల్వే మెన్, నవంబర్ 20న రిక్ అండ్ మోర్టీ, నవంబర్ 21న లియో, నవంబర్ 22న స్కైడ్ గేమ్ ది ఛాలెంజ్, నవంబర్ 23న మై డెమోన్, నవంబర్ 27నరిక్ అండ్ మోర్టీ, నవంబర్ 30న ది బ్యాడ్ గాయ్స్ ఫ్యామిలీ స్విచ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X