OTT: 121 కోట్లతో దళపతి చివరి సినిమాకి రికార్డు ఆఫర్.. ఏ ఓటిటి సొంతం చేసుకుందంటే?

దక్షిణాది సినిమా దగ్గర భారీ స్టార్డం ఉన్న అతి కొద్ది మంది హీరోస్ లో దళపతి విజయ్ కూడా ఒకరు. కాగా తమిళ సినిమా దగ్గర రీమేక్స్ అది కూడా మన తెలుగు సినిమాలు నాలుగైదు కలిపి విజయ్ తనకి ఒక రీమేక్ గా చేసుకుని కెరీర్లో పలు సినిమాలు చేసిన విజయ్ ఇపుడు ఆ సినిమాల హీరోస్ కంటే భారీ మార్కెట్ ని సొంతం చేసుకొని తిరుగు లేని క్రేజ్ ని తమిళ నాట సొంతం చేసుకున్నాడు.

తన క్రేజ్ ఎలా ఉందంటే ఓ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినా కూడా ఈజీగా 400 కోట్లు వసూళ్లు విజయ్ సినిమాకి వస్తున్నాయి. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణే తన గత చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. కాగా ఈ చిత్రానికి రిలీజ్ ముందు వరకు పెద్ద ఎగ్జైట్ చేసే బజ్ రాలేదు. అయినప్పటికీ ఈ సినిమాతో కూడా 400 కోట్లకి పైగా గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకొని తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు.

jana nayagan OTT

ఇలాంటి దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ అని చెప్పి ఇక సినిమాలు చేయను అని తన కెరీర్ 29వ సినిమాగా ఒక్కటి మాత్రం చేసి ఆపేస్తానని షాకిచ్చాడు. కాగా ఇలా తన ఆఖరి సినిమాగా వస్తున్న చిత్రమే "జన నాయగన్". తమిళ్ లో ఖాకీ అలాగే తెగింపు లాంటి సినిమాలు చేసిన దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మన తెలుగు సినిమా బాలయ్య నటించిన సినిమా భగవంత్ కేసరికి రీమేక్ అని టాక్ ఉంది కానీ అధికారికం అయితే కాదు.

కాగా ఇపుడు ఫైనల్ గా ఈ సినిమాకి ఒక బిగ్గెస్ట్ ఓటిటి డీల్ వచ్చినట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సినిమాకి ఏకంగా 120 కోట్లకి పైగా ఓటిటి డీల్ వచ్చిందట. దీనికి ముందు వచ్చిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం కి కూడా ఇదే రేంజ్ డీల్ వచ్చింది. దానికి ముందు సినిమా లియో కి మాత్రం ఆల్ టైం హైయెస్ట్ 150 కోట్లకి పైగా డీల్ వచ్చింది.

కాగా ఇపుడు మళ్ళీ ఫైనల్ గా 100 కోట్లకి పైగా డీల్ విజయ్ చివరి సినిమాకి రావడం అనేది గమనార్హం. అన్నట్టు ఈ సినిమాని దక్కించుకుంది ఎవరో కాదు పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారే అట. కాగా ఈ సినిమా ఎనిమిది వారాల ఒప్పంద ప్రాతిపాదికన ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. సౌత్ భాషల్లో నాలుగు వారాల్లోనే వచ్చేటప్పటకీ హిందీలో థియేట్రికల్ రిలీజ్ కారణంగా ప్రైమ్ వీడియోతో మేకర్స్ హిందీ వెర్షన్ వరకు 8 వారాల డీల్ ని చేసుకున్నారట.

ఇలా పాన్ ఇండియా హక్కులు మొత్తం ప్రైమ్ వీడియోకే దక్కినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ భారీ మొత్తంలో డీల్ పూర్తి కావడంతో సినీ వర్గాల్లో ఇపుడు జన నాయగన్ ట్రెండింగ్ లో నిలిచాడు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే విజయ్ సినిమా దేనికి రీమేక్ అని అంటున్నారో ఆ భగవంత్ కేసరి కూడా ప్రైమ్ వీడియో లోనే అది కూడా పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉండటం గమనార్హం. మరి ఈ రెండు సినిమాలు ఒకటేనా కాదా అనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X