బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా.. ముందుగానే ఓటీటీలోకి తమ్ముడు.. నితిన్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో నితిన్ పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే రాబిన్‌హుడ్‌తో ఫ్లాప్ అందుకున్న నితిన్ ఎలాగైనా కెరీర్‌లో నిలబడాలనే ఉద్దేశంతో చేసిన తమ్ముడు మూవీ కూడా ఆయన తలరాతను మార్చలేకపోయింది. దిల్‌రాజు వంటి అగ్ర నిర్మాత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ మూవీ టైటిల్‌ కూడా నితిన్‌ను గట్టెక్కించలేకపోయాయి. తమ్ముడు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌ దిశగా పయనిస్తూ.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కు భారీ నష్టాలను మిగిల్చనుంది. జూలై 4న విడుదలైన ఈ సినిమా వారానికే చాప చుట్టేసే పరిస్ధితులు కనిపిస్తుండటంతో ఓటీటీ స్ట్రీమింగ్ షెడ్యూల్‌లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

తమ్ముడు బడ్జెట్ ఎంత?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ లాంటి బ్లాక్‌బస్టర్ తెరకెక్కించిన వేణు శ్రీరామ్ .. తమ్ముడు మూవీకి డైరెక్టర్ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రంలో నితిన్ సరసన కాంతారా ఫేమ్ సప్తమీ గౌడతో పాటు వర్ష బొల్లమ్మ, స్వస్తికలు హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటి లయ చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమా ద్వారానే టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తూ కీలకపాత్ర పోషించారు. బిగ్‌బాస్ ఫేం హరితేజ, యానిమల్ ఫేం సౌరబ్ సచ్‌దేవ, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. కాంతార చిత్రానికి సంగీత దర్శకత్వం వహించింన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. కేవీ గుహన్, సమీర్ రెడ్డి, సేతు సినిమాటోగ్రఫిని అందించారు. ప్రవీణ్ పుడి ఎడిటింగ్, జీఎం శేఖర్ ఆర్ట్ వర్క్, విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మ, రామ్ కిషన్ యాక్షన్ కొరియోగ్రఫిని అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు సుమారుగా 75 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది.

Thammudu OTT Release Date Nithiin s Movie to stream earlier than expected

తమ్ముడు బిజినెస్ ఎంత?
తమ్ముడు చిత్రానికి నైజాం ఏరియాలో 8.5 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది. ఇక ఏపీ విషయానికి వస్తే.. సీడెడ్‌ రైట్స్ 3 కోట్ల రూపాయలు, ఇతర జిల్లాల హక్కులు 8.5 కోట్ల రూపాయలకు అమ్మడైనట్లుగా ఫిలింనగర్ టాక్. కొన్ని ఏరియాల్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సొంతంగా రిలీజ్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నారు. మొత్తంగా తమ్ముడు చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లలో 4 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా తమ్ముడు చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల మేర బిజినెస్ జరిగింది. నితిన్ మూవీ లాభాల్లోకి రావాలంటే.. రూ.25 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. తమ్ముడు చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో విడుదల చేశారు.

తమ్ముడు సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్
రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న నితిన్ మూవీ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఈ చిత్రానికి ఇండియా వైడ్ తొలి రోజు రూ.1.9 కోట్ల నెట్, రెండో రోజు రూ.1.16 కోట్ల నెట్, మూడో రోజు రూ.1.28 కోట్ల నెట్, నాలుగో రోజున రూ. 50 లక్షల నెట్ కలెక్షన్స్ సాధించింది. తద్వారా నాలుగు రోజుల వరకు ఇండియాలో రూ.4.84 కోట్ల నెట్.. 5.10 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. ఇక దిల్‌రాజు సినిమాలకు మంచి మార్కెట్ అయిన ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు కేవలం రూ.80 లక్షల కలెక్షన్స్‌ మాత్రమే అందుకోగలిగింది. తద్వారా తమ్ముడు సినిమా నాలుగు రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల రూపాయలు మాత్రమే ఆర్జించినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. తమ్ముడు సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ.20 కోట్ల రూపాయల వరకు రాబట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం థియేట్రికల్ రన్ పరంగా చూస్తే ఆ పరిస్థితులు కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తమ్ముడు ఓటీటీ రిలీజ్
థియేటర్‌లో డిజాస్టర్ కావడంతో ఈ సినిమా కాస్త ముందుగానే ఓటీటీలో రిలీజ్ కానుంది. సహజంగా ఓటీటీ ఒప్పందాల ప్రకారం థియేటర్‌లో రిలీజైన నెల రోజుల తర్వాత.. థియేట్రికల్ రన్ బాగుంటే 6 వారాల తర్వాత సినిమాలు ఓటీటీలోకి వస్తాయి. కానీ తమ్ముడు సినిమా వారానికే ఎత్తేసే పరిస్ధితులు నెలకొనడంతో డెడ్‌లైన్ కంటే ముందే నితిన్ చిత్రం ఓటీటీలోకి రానుంది. తమ్ముడు ఓటీటీ డీల్ కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు పోటీపడగా.. చివరికి ఫ్యాన్సీ రేటుకు నితిన్ మూవీ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్న వార్తలను బట్టి తమ్ముడు సినిమా జూలై చివరి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణను దక్కించుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Read more about: thammudu nithiin dil raju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X