Thammudu OTT: ఓటీటీలోకి తమ్ముడు .. నితిన్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
ఎప్పుడో 23 ఏళ్ల క్రితం కెరీర్ స్టార్ట్ చేసినా నేటికీ స్టార్‌డమ్ కోసం శ్రమిస్తున్నారు హీరో నితిన్. ఒక హిట్ ఇస్తే 10 ఫ్లాప్స్ అన్నట్లుగా ఆయన కెరీర్ సాగుతోంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన రాబిన్‌హుడ్ ఫ్లాప్ కావడంతో డీలా పడిన నితిన్.. ఈసారి ఎలాగైనా సాలీడ్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. రీసెంట్‌గా ఆయన నటించిన చిత్రం తమ్ముడు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ తెరకెక్కించిన వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. పైగా దిల్‌రాజు నిర్మాత కావడంతో తమ్ముడు చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాగా.. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఏ సంస్థ దక్కించుకుంది? ఏ ఓటీటీలో తమ్ముడు మూవీ స్ట్రీమింగ్ కానుంది? ఈ వివరాల్లోకి వెళితే..
తమ్ముడు బడ్జెట్ ఎంత?
తమ్ముడు సినిమాలో నితిన్ సరసన సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, స్వస్తికలు హీరోయిన్లుగా నటించారు. సీనియర్ హీరోయిన్ లయ చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తూ కీలకపాత్ర పోషించారు. హరితేజ, యానిమల్ ఫేం సౌరబ్ సచ్‌దేవ, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీత సారథ్యం వహించారు. కేవీ గుహన్, సమీర్ రెడ్డి, సేతు సినిమాటోగ్రఫిని అందించారు. ప్రవీణ్ పుడి ఎడిటింగ్, జీఎం శేఖర్ ఆర్ట్ వర్క్, విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మ, రామ్ కిషన్ యాక్షన్ కొరియోగ్రఫిని అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు ఈ తమ్ముడు సినిమాను సుమారుగా 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

తమ్ముడు బిజినెస్ ఎంత?
టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు తోడు వేణు శ్రీరామ్ దర్శకత్వం .. దిల్‌రాజు నిర్మాత కావడంతో తమ్ముడు సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన రాబిన్‌హుడ్ డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ నితిన్ మార్కెట్ చెక్కు చెదరలేదని విశ్లేషకులు చెబుతున్నారు. తమ్ముడు చిత్రానికి నైజాం ఏరియాలో 8.5 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది. ఇక ఏపీ విషయానికి వస్తే.. సీడెడ్ రైట్స్ 3 కోట్ల రూపాయలు, ఇతర జిల్లాల హక్కులు 8.5 కోట్ల రూపాయలకు అమ్మడైనట్లుగా ఫిలింనగర్ టాక్. కొన్ని ఏరియాలలో బిజినెస్ జరగ్గా.. కొన్ని ఏరియాల్లో మాత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సొంతంగా రిలీజ్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తంగా తమ్ముడు చిత్రానికి ఏపీ, తెలంగాణలో 20 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని తెలిపారు.
తమ్ముడు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఇర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటకలో 1.5 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియా హక్కులు 50 లక్షలు, ఓవర్సీస్ రైట్స్ 2 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. మొత్తంగా తమ్ముడు చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ కింద సుమారుగా 24 కోట్ల మేర బిజినెస్ జరిగింది. నితిన్ మూవీ లాభాల్లోకి రావాలంటే.. దాదాపు రూ. 25 కోట్లు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. తమ్ముడు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 400 థియేటర్లలో, ప్రపంచవ్యాప్తంగా 600 స్క్రీన్లలో విడుదల చేశారు.
తమ్ముడు ఏ ఓటీటీలో
తమ్ముడు సినిమా ఓటీటీ వివరాల్లోకి వెళితే.. నితిన్ మూవీ డిజిటల్ రైట్స్‌ను తొలుత అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే చివరికి అవి ఫ్యాన్సీ రేటుకు నెల్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. థియేటర్‌లో వచ్చిన 5 వారాల తర్వాత ఓటీటీలోకి రావాలన్న నిబంధన ప్రకారం తమ్ముడు సినిమా ఆగస్ట్ మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. థియేట్రికల్ రన్‌ను బట్టి సినిమాలో ఓటీటీ స్ట్రీమింగ్ ముందుగా జరగొచ్చు.. లేదంటే ఆలస్యం కావొచ్చు. తమ్ముడు ఓటీటీ రిలీజ్‌పై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.


Click it and Unblock the Notifications











