Thandel OTT Release : కళ్లు చెదిరే రేటుకు తండేల్ ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?

అక్కినేని నాగార్జున నటవారసుడు గతేదాది ఓ ఇంటి వాడైన సంగతి తెలిసిందే. వరుస ఫ్లాపుల్లో ఉన్న నాగచైతన్య హిట్ వాసన చూసి చానాళ్లు అవుతోంది. అప్పుడెప్పుడో బంగార్రాజు తర్వాత ఇప్పటి వరకు చైతూకి సరైన విజయం లేదు. థ్యాంక్, లాల్ సింగ్ చద్దా, కస్టడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో నాగచైతన్య కెరీర్ డైలమాలో పడింది. పెళ్లి తర్వాతనైనా తన రాత మారుతుందని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో కార్తీకేయ -2తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. శ్రీకాకుళం జిల్లాకు సముద్రంలో చేపలు పట్టుకుని జీవించే మత్స్యకారులు అనుకోని విధంగా అంతర్జాతీయ జలాలను దాటి పాకిస్తాన్‌ సైన్యానికి చిక్కడం, అక్కడి జైళ్లలో ఇబ్బందులు , తిరిగి విడుదల కావడం కోసం పడ్డ ఇబ్బందులే ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు ఈ సినిమాను రూ. 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నాగచైతన్య కెరీర్‌లోనే అత్యథిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ఇదే. ఇందులో చైతూ సరసన లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి హీరోయిన్‌గా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తుండగా.. ప్రకాశ్ బెలవాడి, కరుణాకరన్, కల్పలత, పర్వతీశం, మహేశ్ అచంట తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Thandel OTT release when to expect akkineni naga chaitanya s Movie to stream online

టీజర్, ట్రైలర్, పోస్టర్లతో భారీ హైప్ క్రియేట్ చేసిన తండేల్‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ, నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, హిందీ, ఓవర్సీస్ ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 16 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ సుమారుగా 11 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దాంతో రెండు రాష్ట్రాల్లో 27 కోట్ల మేర రైట్స్ బిజినెస్ వాల్యూ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ 28 కోట్ల షేర్.. సుమారుగా 60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.

ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌కు సుమారుగా 3 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. హిందీ రైట్స్ 10 కోట్ల మేర వాల్యూ కట్టారు. అలాగే ఓవర్సీస్ రైట్స్ కూడా 12 కోట్ల మేర అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 52 కోట్ల మేర జరగడంతో తండేల్ లాభాల్లోకి రావాలంటే 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది . ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1500 స్క్రీన్లలో నాగచైతన్య సినిమాను రిలీజ్ చేశారు.

Thandel OTT release when to expect akkineni naga chaitanya s Movie to stream online

మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న తండేల్‌ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అప్పుడే ఓటీటీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. తండేల్ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేట్‌కు సొంతం చేసుకున్నట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఓటీటీ నిబంధనల ప్రకారం.. థియేటర్‌లో రిలీజైన 5 నుంచి 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలి. అయితే ఓటీటీ సంస్థకు, నిర్మాతలకు జరిగిన ఒప్పందం బట్టి ఇది ముందుకు , వెనక్కి మారే అవకాశాలు లేకపోలేదు. మొత్తంగా మార్చి రెండో వారంలో తండేల్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X