For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Thank You Movie OTT: 20 రోజులకే డిజిటల్ రిలీజ్.. ఆ ఓటీటీలో చైతూ సినిమా

  |

  అక్కినేని నాగార్జున వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన నటన, టాలెంట్‌తో అతి తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌డమ్‌ను అందుకున్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. ఆ తర్వాత చాలా కాలం పాటు వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు. అయితే, 'మజిలీ' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన ఈ అక్కినేని హీరో.. దీని తర్వాత 'వెంకీ మామ', 'లవ్ స్టోరి', 'బంగార్రాజు' వంటి సూపర్ హిట్లను అందుకుని సత్తా చాటాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నాడు.

  పబ్లిక్‌లో సీరియల్ హీరోయిన్ రొమాన్స్: అతడికి లిప్ కిస్ పెట్టేసి ఘోరంగా!

  హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్న నాగ చైతన్య.. ఈ ఉత్సాహంలోనే ఇటీవలే టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్‌తో కలిసి 'థ్యాంక్యూ' అనే సినిమాలో నటించాడు. ఫుల్ లెంగ్త్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు నాగ చైతన్య వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్‌లో ఉన్న కారణంగా ఈ చిత్రానికి భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ క్రేజీ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ అత్యధికంగానే జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను జూలై 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే.

  Thank You Movie Streaming on Amazon Prime From August 11th

  క్రేజీ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'థ్యాంక్యూ' మూవీ అనుకున్నట్లుగానే భారీ స్థాయిలో విడుదలైంది. కానీ, ఆరంభంలోనే దీనికి మిక్స్‌డ్ టాక్ రావడం కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. దీంతో ఏపీ, తెలంగాణలో అంతగా కలెక్షన్లు రాలేదు. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు ఆదరణ కరువైంది. దీంతో ఈ సినిమాకు ముగింపు సమయానికి చాలా తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా ఈ సినిమాకు ప్రపంచ ఫుల్ రన్‌లో కేవలం రూ. 4.45 షేర్‌తో పాటు రూ. 8.00 కోట్లు గ్రాస్‌ మాత్రమే వసూలు అయింది. దీంతో రూ. 25 కోట్లు టార్గెట్‌తో విడుదలైన ఈ సినిమాకు ఏకంగా రూ. 20.55 కోట్లు నష్టాలు వచ్చాయి.

  బిగ్ బాస్ దివి పరువాల విందు: వామ్మో ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే!

  థియేటర్లలో అంతగా సందడి చేయలేకపోయిన 'థ్యాంక్యూ' మూవీని త్వరగానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత దిల్ రాజు ఎన్నో సంస్థలతో డీల్స్ మాట్లాడారని ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓ ప్రకటన చేసింది. దీన్ని ఆగస్టు 11 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అందులో వెల్లడించింది. అంటే విడుదలై నెల రోజులు కూడా కాకముందే ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతుందన్న మాట. ఇక, దీని కోసం అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  Thank You Movie Streaming on Amazon Prime From August 11th

  అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన మూవీనే 'థ్యాంక్యూ'. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఎస్ థమన్ దీనికి సంగీతం అందించాడు. ఈ మూవీకి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్‌ రవి కథ, మాటలు అందించాడు.

  English summary
  Akkineni Naga Chaitanya DId Thank You Movie under Vikram K. Kumar Direction. This Movie Streaming on Amazon Prime From August 11th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X