OTTలోకి రీసెంట్ క్రైమ్ కామెడీ ఫిల్మ్.. వాళ్లు మాత్రం ఒక్కరోజు ముందు నుంచే చూసేయచ్చు.. ఎప్పుడు, ఎక్కడంటే?
తరుణ్ భాస్కర్ నటించి.. దర్శకత్వం వహించిన తాజా చిత్రం కీడాకోలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం, చైతన్య రావు మదాడి, తరుణ్ భాస్కర్, రఘురామ్, రాగ్ మయూర్, జీవన్, విష్ణు తదితరులు నటించిన ఈ చిత్రం నవంబర్ 3వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. ముఖ్యంగా మొదటి నుంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా బాక్సాఫీసు వద్ద బాగానే వసూళ్లు రాబట్టుకుంది. ముఖ్యంగా రానా సమర్పణలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతుంది. అయితే ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాలో ఆయన చైతన్య రావుకు తాతగా కనిపించారు. అలాగే వీరి వద్ద ఉండే లాయర్ రాగ్ మయూర్ లకు డబ్బులు సంపాదించాలని ఆశ ఎక్కువ. ఇదే పనిగా వీరు డబ్బులు సంపాధించాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే బ్రహ్మానందం కొన్న ఓ కూల్ డ్రింగ్ బాటిల్ లో బొద్దింకను చూపించి... యజమానిని భయపెట్టి కోట్లు సంపాధించాలని అనుకుంటారు. బ్లాక్ మెయిల్ చేసేందుకు కూడా చాలానే ప్రయత్నాలు చేస్తారు. 5 కోట్ల రూపాయల నుంచి బేరం ఆడుతూ కనిపిస్తారు.

అలాగే జీవన్ కు కార్పొరేటర్ కావాలని ఆశగా ఉంటుంది. ఈయన అన్న నాయుడు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి వస్తాడు. దీంతో సోదరుడి అండ చూసుకొని జీవన్ కార్పొరేట్ కావాలని విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే అందుకు డబ్బులు కావాల్సి ఉండడంతో వీళ్లు కూడా ఓ ప్లాన్ వేసుకుంటారు. ఎలాగైనా సరే కోట్లు సంపాధించాలని చేసిన ప్లాన్ ఫలించిందా లేదా అనేది కథ. వీరికి బ్రహ్మానందం బ్యాచ్ కు సంబంధం ఏంటి.. కూల్ డ్రింక్ లోకి బొద్దింక ఎలా చేరింది.. చివరకు వాళ్లు యజమాని నుంచి ఏమైనా డబ్బులు పొందాడా లేదా అనేది కీడాకోలా అసలు కథ.

అద్భుతమైన కమెడియన్లతో తెరకెక్కించిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ముఖ్యంగా డిసెంబర్ 29వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా వేధికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్లకు మాత్రం ఒక్కరోజు ముందు నుంచే ఈ సినిమా చూసే అవకాశం ఉంటుంది. అంటే ఈనెల 28వ తేదీ నుంచి ఈ సినిమాను చూసేయచ్చు. ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని చూడకపోయినా, థియేటర్లకు వెళ్లకపోయినా ఈ చిత్రాన్ని ఓటీటీ వేధికగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











