సడన్‌గా ఓటీటీలోకి క్రైమ్ కామెడీ మూవీ.. చూడాలంటే మాత్రం ఒక కండీషన్
క్రైమ్ కామెడీతో వచ్చే సినిమాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రీతిలో స్పందన లభిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే ఈ విషయం చాలా చిత్రాల విషయంలో రుజువు కూడా అయింది. అందుకే ఇలాంటి సినిమాలు చేసేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఇలా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రేజీ మూవీనే 'కీడా కోలా'.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటించి, తెరకెక్కించిన సినిమానే 'కీడా కోలా'. సస్పెన్స్ జోనర్‌లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి రెండు రోజులూ విశేషమైన స్పందన లభించింది. కానీ, ఆ తర్వాత నుంచే ఈ సినిమా ఆశించిన రీతిలో స్పందనను రాబట్టలేదు.

క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం కావడంతో 'కీడా కోలా'కు ఆరంభంలోనే మంచి హైప్ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా మంచి బిజినెస్‌ను చేసుకుని ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కానీ, సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరలేకపోయింది. ఫలితంగా ఇది బాక్సాఫీస్ ముందు ఏవరేజ్‌గానే మిగిలిపోయింది.
థియేటర్లలో కొద్ది రోజుల పాటే సందడి చేసిన 'కీడా కోలా' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించి మంచి పోటీనే వచ్చింది. ఈ పరిస్థితుల్లో తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం నిర్మాతలకు సదరు సంస్థ మంచి మొత్తాన్ని కూడా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ సినిమా కోసం ఓటీటీ ప్రియులు చూస్తున్నారు.

క్రైమ్ కామెడీ కాన్సెప్టుతో రూపొందిన 'కీడా కోలా' మూవీని డిసెంబర్ 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సదరు సంస్థ ఇటీవలే ప్రకటించింది. కానీ, దీన్ని నేటి నుంచే అందుబాటులోకి తీసుకు వచ్చేసింది. అయితే, ఆహా గోల్డ్ మెంబర్‌షిప్ ఉన్న వాళ్లు మాత్రమే నేటి నుంచి చూడడం కుదురుతుంది. మామూలు యూజర్లకు మాత్రం 29 నుంచే అందుబాటులోకి వస్తుంది.
ఇదిలా ఉండగా.. 'కీడా కోలా' చిత్రాన్ని సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం, హరి కాంత్, చైతన్య రావు, రఘురామ్, విష్ణు, జీవన్ కుమార్ తదితరులు నటించారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











