అతీంద్రియ శక్తులతో హత్యలు .. ఓటీటీలోకి వెన్నులో వణుకు పుట్టించే మూవీ, ఎందులో అంటే?

హర్రర్ , థ్రిల్లర్ , సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో వచ్చే సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఇక ఓటీటీల రాకతో ఈ జోనర్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ప్రతి వారం అన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో పదుల సంఖ్యలో హర్రర్, థ్రిల్లర్ సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ఈ వారం కూడా సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో సీనియర్ నటుడు నాజర్ నటించిన హార్రర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉన్నారు నాజర్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆయన ప్రతియేటా పదుల సంఖ్యలలో సినిమాలలో నటిస్తున్నారు. బాహుబలి సిరీస్‌తో ఆయన దేశప్రజలకు బాగా పరిచయమయ్యారు. ఓటీటీల రాకతో నాజర్ వంటి నటులకు అవకాశాలు క్యూకడుతున్నాయి. కొత్తగా ఎంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తున్నా ఆయన స్టానానికి మాత్రం ఢోకా లేదన్నట్లుగా దూసుకెళ్తున్నారు నాజర్. ఆయన తాజాగా కీలకపాత్ర పోషించిన సినిమ ది అకాలీ. గతేడాది మే 31న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా హార్రర్ ఇష్టపడే వారికి సరికొత్త అనుభూతిని మిగిల్చింది.

The Akaali ott release here is the Nassar s Movie ott streaming details

మహమ్మద్ ఆసిఫ్ హమీద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాజర్ , తలైవాసల్ విజయ్, జయకుమార్ జానకీ రామన్ , వినోద్ కిషన్, స్వయం సిద్ధలు కీలకపాత్ర పోషించారు. పీబీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఉకేశ్వరన్ ప్రభు ఈ సినిమాను నిర్మించారు. అనిష్ మోహన్ సంగీత దర్శకత్వం వహించగా.. గిరి ముర్ఫీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. క్షుద్ర విద్యలు , అతీంద్రయ శక్తులతో ఓ అమ్మాయి వరుసగా హత్యలకు పాల్పడుతుంది. వీటిని ఎవరు చేస్తున్నారు? ఎందు చేస్తున్నారు? అనేది తెలుసుకోవడానికి హమ్జా అనే పోలీస్ అధికారి రంగంలో దిగుతాడు. జానిష్‌ను హమ్జా ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలను ఫేస్ చేశాడు? అన్నదే ఈ సినిమా కథ. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.

కాకపోతే కామెడీ, కమర్షియల్‌లను టచ్ చేయకుండా కేవలం డార్క్ హార్రర్ థ్రిల్లర్‌గా దర్శకుడు ఈ సినిమాను మలిచాడు. బడ్జెట్ పరిమితులు ఈ చిత్రానికి మైనస్‌గా నిలిచాయి. కథ, కథనానికి మాత్రం విమర్శకుల నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చింది. ఐఎండీబీలో ఏకంగా 10కి 9.1 రేటింగ్ ఈ సినిమాకు వచ్చిందంటే అర్ధం చేసుకోవచ్చు. థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాత ది అకాలీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. గతేడాది జూలై 19న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది.

తమిళంలో వచ్చిన దాదాపు ఏడాది తర్వాత తెలుగులో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఏప్రిల్ 26 నుంచి ది అకాలీ చిత్రం.. ఆహా తెలుగులో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్ధ అధికారికంగా ప్రకటించింది. మరి తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. థియేటర్‌లో ఫట్ అయిన చాలా సినిమాలు.. ఓటీటీలో ఘటన విజయం సాధించిన నేపథ్యంలో ది అకాలీపై ఆశలు పెట్టుకుంది చిత్ర యూనిట్.

More from Filmibeat

Read more about: nassar ott news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X