The Family Man 3 Ott Release : ఓటీటీలోకి ది ఫ్యామిలీ మ్యాన్ 3.. రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?
2019లో మొదటగా 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ ప్రారంభమైంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాయ్ పేయ్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుందీ సిరీస్. డీ2కే ప్రొడక్షన్ లో నిర్మించారు. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు ద్వయం దర్శకత్వం వహించారు. ఓటీటీలో విడుదలై సంచలనం సృష్టించింది. 'ది ఫ్యామిలీ మ్యాన్', 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ లు విడుదలై ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1లో శ్రీకాంత్ తివారీగా మనోజ్ వాజ్ పేయ్, సుచిత్ర తివారీగా ప్రియమణి అలరించారు. వీరిద్దరూ భార్యభర్తలుగా నటించారు. శ్రీకాంత్ తివారీ థ్రెట్ అనాలిసిస్ అండ్ సర్వైలెన్స్ సెల్ (TASC) సీనియర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తారు. తన బెస్ట్ ఫ్రెండ్, సహ ఉద్యోగి జేకే తల్పాడేతో కలిసి పనిచేస్తారు. ఆయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో విధులు నిర్వహిస్తూ ఉంటారు. వీరిద్దరూ ఒక టెర్రర్ ఎటాక్ ను అడ్డుకునేందుకు పోరాడుతారు. జోయా, మిలింద్, జయేష్, ఫోర్స్ వన్ అధికారి ఇమ్రాన్ పాషా.. మిషన్ జుల్ఫికర్ అనే టెర్రర్ ఎటాక్ ను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు.

ఇక ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో.. శ్రీలంక నుండి తమిళ టైగర్ల సైనిక ప్రతిఘటనను చూపిస్తారు. స్వాతంత్ర్య పోరాటం కోసం వారి ప్రణాళికలు ఎలా ఉన్నాయనేది కథ సారాంశం. 2వ సీజన్ లో టావీస్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) రాజలక్ష్మి సెకారన్ పాత్రలో అలరించింది. తన యాక్షన్ సీన్లతో నార్త్ ఆడియెన్స్ ను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3' కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.
ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3లో చైనా ఇండియాలోని నార్త్ ఈస్టరన్ రాష్ట్రాలపై దాడిని చూపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ థ్రిల్లర్ సిరీస్ కు మంచి ఆదరణ దక్కడంతో ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్ ఈ సిరీస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే సీజన్ 3 ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తిగా కంప్లీట్ అయ్యిందని మేకర్స్ అప్డేట్ అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
అయితే ఈ సిరీస్ ఐపీఎస్ సీజన్ ముగిసిన తర్వాత ఓటీటీలోకి విడుదల కాబోతుందని తెలుస్తోంది. 2025 మే నెలలో విడుదల కాబోతోంది. ఇంకా పక్కా డేట్ మాత్రం అనౌన్స్ కావాల్సి ఉంది. మరో నెలరోజుల్లో ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో రిలీజ్ కావడం ఖాయం. ఇక మూడో సీజన్ లో శ్రీకాంత్ తివారీ, ప్రియమణిలతో పాటు సందీప్ కిషణ్, షరిబ్ హష్మీ, అశ్లేషా ఠాకూర్, షరద్ కేల్కర్, దలిప్ పాత్రలు కొనసాగనున్నాయి. అదనంగా జైదీప్ హాల్వత్ పాత్ర అలరించబోతోంది. ఏడాది కిందనే ఈ సీజన్ ఓటీటీలోకి రావాల్సింది. కానీ కరోనా కారణంగా షూటింగ్ డీలే అవ్వడంతో రిలీజ్ కూడా ఆలస్యమైంది.


Click it and Unblock the Notifications











