ది ఫ్యామిలీ మ్యాన్ 3 స్టార్స్‌కి రికార్డ్ రెమ్యునరేషన్.. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణికి ఎన్నికోట్లంటే?
ది ఫ్యామిలీ మ్యాన్.. స్పై, దేశభక్తి, యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికీ రెండు పార్ట్స్ రిలీజ్ కాగా.. నవంబర్ 21 నుంచి ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ప్రేక్షకుల ముందుకొచ్చి రికార్డ్ వ్యూస్‌తో అలరిస్తోంది. హీరో మనోజ్ బాజ్‌పేయి మరోసారి తనదైన నటనతో వన్ మెన్ షోగా ఈ వెబ్ సిరీస్‌ను తన భుజాలపై నడిపించాడు. మిగిలిన నటీనటులు కూడా అతనికి చక్కని సహకారం అందించారు. ఈ నేపథ్యంలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో నటించిన నటీనటులకు రెమ్యునరేషన్ ఎంత? ఎవరెవరికీ ఎన్ని కోట్లు పారితోషికంగా వచ్చింది? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..
ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ గ్రాండ్ సక్సెస్
2019 సెప్టెంబర్ 20న అమెజాన్ ప్రైమ్‌లో ది ఫ్యామిలీ మ్యాన్ తొలి సీజన్ రిలీజై ఒక ఊపు ఊపింది. దానికి సీక్వెల్‌గా 2021 జూన్ 4న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 స్ట్రీమింగ్‌లోకి వచ్చి రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. భారత గూఢచార విభాగంలో పనిచేసే ఓ వ్యక్తి, అతని కుటుంబం.. విధి నిర్వహణలో అతనికి ఎదురయ్యే పరిస్ధితులను ఇందులో చూపించారు. తొలి సీజన్‌లో భారత్‌పై ఉగ్రవాదులు చేసే కుట్రలు, దాడులను ఎదుర్కోవడం చూపించారు.

సమంత యాక్షన్ సీన్స్
రెండో సీజన్‌లో తమిళ టైగర్స్‌పై స్పెషల్ ఆపరేషన్ వంటివి ఇతివృత్తంగా తీసుకున్నారు. సెకండ్ సీజన్‌లో టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత రంగ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సీరిస్ దక్షిణ భారతదేశంలోనూ పాపులర్ అయ్యింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో కొత్త సమంతను చూపించారు. రెండు సీజన్‌లు విజయవంతం కావడంతో మూడో సీజన్‌ను కూడా పట్టాలెక్కించారు రాజ్ అండ్ డీకే.
నవంబర్ 21 నుంచి ది ఫ్యామిలీ మ్యాన్ 3
ది ఫ్యామిలీమెన్ సీజన్ 3లో మనోజ్ బాజ్‌పేయ్, ప్రియమణి లీడ్ రోల్స్ పోషించారు. కీషోర్ కుమార్, గుల్ పనాగ్, శ్రేయా ధన్వంతరి, సందీప్ కిషన్, సన్నీ హిందూజా, అభయ్ వర్మ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ వెబ్ సిరీస్‌కు సచిన్ జిగర్ సంగీతం, కేతన్ సోదా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అజిమ్ మూలన్, నిగమ్ బోంజన్ సినిమాటోగ్రపి, సుమతి కొటియాన్ ఎడిటింగ్ బాధ్యతలు అందించారు. డీ2R బ్యానర్‌పై రూపొందిన ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 నవంబర్ 21వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లోకి అందుబాటులోకి వచ్చింది.
ది ఫ్యామిలీ మ్యాన్ 3 కథ ఇదే
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కథ విషయానికి వస్తే.. పాకిస్తాన్ - మయన్మార్‌లతో కలిసి భారతదేశంపై చైనా చేస్తోన్నకుట్రలు, ఇండో - మయన్మార్ సరిహద్దు ప్రాంతంలోని పరిస్ధితులను వివరించారు. వీటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు. తన కుటుంబాన్ని చూసుకుంటూనే, సీక్రెట్ ఏజెంట్‌గా ఎలా దేశాన్ని కాపాడాడు అన్నదే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఇతివృత్తం ఈ సిరీస్ కోసం నటీనటులు తీసుకున్న పారితోషికాలు పరిశీలిస్తే..
నటీనటుల రెమ్యునరేషన్స్ ఇవే
శ్రీకాంత్ తివారీగా నటించిన మనోజ్ బాజ్‌పేయికి అత్యధికంగా 20 నుంచి 22 కోట్ల రూపాయల పారితోషికం లభించింది. అతనికి భార్యగా నటించిన హీరోయిన్ ప్రియమణి 7 కోట్ల రూపాయలు, విలన్‌గా నటించిన జైదీప్ అహ్లావత్‌కి 9 కోట్ల రూపాయలు, నిమ్రత్ కౌర్‌కి 8 నుంచి 9 కోట్ల రూపాయలు, దర్శన్ కుమార్‌కి 9 కోట్ల రూపాయలు, సీమా బిస్వాస్, విపిన్ శర్మలకు 1 నుంచి 2 కోట్ల రూపాయలను పారితోషికంగా చెల్లించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాంతో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కోసం ఒక్క రెమ్యునరేషన్స్ కింద మేకర్స్ దాదాపుగా 100 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











