OTT: ఫ్యామిలీ మ్యాన్ నుంచి మీర్జాపూర్ దాకా.. సీజన్ 3తో రానున్న పాపులర్ 10 వెబ్ సిరీసులు

ప్రస్తుతం సినీ ఎంటర్టైన్ మెంట్ లో ఓటీటీల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వచ్చాక వాటిలో ఎక్కువగా సందడి చేసేవి వెబ్ సిరీస్ లు. బాషా బేధం లేకుండా డిఫరెంట్ జోనర్స్ లో వచ్చే ఈ వెబ్ సిరీస్ లను వీక్షించే సినీ ప్రేమికులు ఎందరో. వెండితెరపై చెప్పలేని కథలను ఈ వెబ్ సిరీస్ ల రూపంలో ఓటీటీలపై చెబుతున్నారు దర్శకనిర్మాతలు.

అగ్ర నటీనటులు సైతం ఓటీటీల ఒరిజినల్ సిరీస్ ల ద్వారా కొత్త కథలను ఆవిష్కరించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలు వెబ్ సిరీస్ లు ఆడియెన్సును విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే వాటి కొనసాగింపుగా సీజన్లు రూపొందిస్తున్నారు. తెలుగులో కూడా ఉన్న ఈ పాపులర్ సిరీస్ లు సీజన్ 3తో రాబోతున్నాయి. అవేంటో చూసేద్దామా!

 మీర్జాపూర్

మీర్జాపూర్

తెలుగు సినీ ప్రియులకు అసలైన ఎంటర్టైన్ మెంట్ ఇచ్చిన వెబ్ సిరీస్ మీర్జాపూర్. అశ్లీలత, బూతులను తెలుగు ప్రేక్షకులకు మొదటగా పరిచయం చేసింది ఈ సిరీసే అని చెప్పుకోవచ్చు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, రసిక దుగల్, శ్వేతా త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఇప్పటికీ రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 3 కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తయిన ఈ సిరీస్ మూడో సీజన్ (Mirzapur 3) త్వరలో అమెజాన్ ప్రైమ్ వేదికగా రానుంది.

ది ఫ్యామిలీ మ్యాన్

ది ఫ్యామిలీ మ్యాన్

స్టార్ హీరోయిన్ సమంత ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. బాలీవుడ్ స్టార్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత రెండో సీజన్ ను మరింత పకడ్బందీగా తెరకెక్కించారు. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ మూడో సీజన్ (The Family Man 3) త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఫస్ట్ సీజన్ లో సందీప్ కిషన్ నటించి ఆకట్టుకోగా రెండో సీజన్ లో సమంత అదరగొట్టింది.

పంచాయత్

పంచాయత్

ఎలక్షన్స్ నేపథ్యంలో వచ్చిన వెబ్ సిరీస్ పంచాయత్. జితేంద్ర కుమార్ నటించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ తీసుకొచ్చిన ఒరిజినల్ వెబ్ సిరీస్. ఇప్పటి వరకు రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ విశేషమైన ప్రేక్షాకదారణ పొందింది. ఎంతలా అంటే IMDbలో ఏకంగా 8.9 రేటింగ్ వచ్చేంత. ఈ సిరీస్ లో కూడా 3వ సీజన్ ను (Panchayath 3) తీసుకొస్తున్నట్లు మేకర్స్ ధృవీకరించారు. అయితే కొంతసమయం పడుతుందని తెలిపారు.

ఆర్య

ఆర్య

బాలీవుడ్ సీనియర్ బ్యూటి సుస్మితా సేన్ ప్రధాన పాత్ర పోషించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆర్య. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ పలు అంతర్జాతీయ అవార్డులకు నామినేట్ అయింది. ఇప్పటికే షూటింగ్ జరుగుతున్న ఈ సిరీస్ మూడో సీజన్ అంటే ఆర్య 3 (Aarya 3) త్వరలో రానుంది. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

షి

షి

బాలీవుడ్ ఫిలీం మేకర్ ఇంతియాజ్ అలీ రూపొందించిన వెబ్ సిరీస్ షి (She). దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఇప్పటికే రెండు సీజన్లు స్ట్రీమింగ్ అయ్యాయి. బ్యూటిఫుల్ ఆదితి పోహంకర్, మిల్కీ బ్యూటి తమన్నా రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రైమ్, థ్రిల్, డ్రామాతో కూడిన ఈ సిరీస్ కు కూడా సీజన్ 3 (She 3) రాబోతుంది.

ఢిల్లీ క్రైమ్

ఢిల్లీ క్రైమ్

ఓటీటీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ లలో ఢిల్లీ క్రైమ్ ఒకటి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ లో ఢిల్లీ పోలీసుల ఇబ్బందులు, ఇన్వెస్టిగేషన్, రాజకీయ ఒత్తిళ్లు వంటివి చూపించారు. నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ కు ఎమ్మీ అవార్డ్ సహా పలు ఇతర డిజిటల్ అవార్డులను సైతం గెలుచుకుంది. షెఫాలీ షా, రసిక దుగల్, రాజేష్ తైలాంగ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ కూడా 3వ సీజన్ (Delhi Crime 3) కోసం రెడీ అవుతోంది.

మరో 4 సిరీస్ లు..

మరో 4 సిరీస్ లు..

ఇవే కాకుండా పాపులర్ ఇండియన్ షోల జాబితాలో 'మిస్ మ్యాచ్డ్' సిరీస్ కూడా ఉంది. 2017లో సంధ్యా మీనన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ మూడో సీజన్ త్వరలో నెట్ ఫ్లిక్స్ లో రాబోతుంది. అరుణోదయ్ సింగ్, మహి గిల్, నిధి సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'అపరహరణ్' మూడో సీజన్ వూట్ ఓటీటీలో రానుంది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో 'కోటా ఫ్యాక్టరీ' 3వ సీజన్, బాలీవుడ్ వైవ్స్ మహీప్ కపూర్, సీమా కిరణ్ సజ్దే, నీలం కొఠారి సోని, భావా పాండేల పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కనుంది 'ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్' మూడో సీజన్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X