The GirlFriend OTT: కళ్లు చెదిరే ధరకు ది గర్ల్ ఫ్రెండ్ ఓటీటీ డీల్.. రష్మిక మూవీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
వరుస సినిమాలు, బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో దూసుకెళ్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ ఏడాది ఇప్పటికే ఛావా, సికందర్, కుబేర, థామా సినిమాలలో నటించి నాలుగు హిట్స్‌ని తన ఖాతాలో వేసుకున్నారు రష్మిక. తెలుగు, హిందీ, తమిళ్ భాషలలో రష్మిక కోసం దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. నవంబర్ 7వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక పేరు మీద ఈ సినిమాకు భారీగా బిజినెస్ జరిగింది. ఈ నేపథ్యంలో ది గర్ల్ ఫ్రెండ్ ఓటీటీ డీల్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. మరి రష్మిక మందన్న మూవీ డిజిటల్ రైట్స్‌నపి ఏ ఓటీటీ సంస్థ దక్కించుకుంది? ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు? ఈ వివరాలు పరిశీలిస్తే..
టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్ఫణలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రంలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు నటించారు. ది గర్ల్ ఫ్రెండ్‌కు హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫిని, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్నారు.

ది గర్ల్‌ఫ్రెండ్ ప్రీ రిలీజ్ బిజినెస్
రష్మిక మందన్న స్టార్ వాల్యూతో ది గర్ల్ ఫ్రెండ్‌కు కళ్లు చెదిరే బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కాలేజ్, లవ్, రొమాంటిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ది గర్ల్‌ఫ్రెండ్‌పై హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా రష్మిక మందన్న తన మార్క్ చూపించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా 24 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా తెలుస్తోంది.
యూ/ఏ సర్టిఫికెట్
ఈ సినిమా హిందీ డబ్బింగ్, శాటిలైట్స్ కలిపి 7 కోట్ల రూపాయలు, ఆడియో రైట్స్ 3 కోట్ల రూపాయలు చొప్పున వచ్చాయి. ఇక ది గర్ల్ ఫ్రెండ్ డిజిటిల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 14 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో చిత్ర నిర్మాతలు ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి వచ్చినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయగా.. ఈ సినిమా నిడివి 2 గంటల 18 నిమిషాలుగా వచ్చింది.
ది గర్ల్ ఫ్రెండ్ ఏ ఓటీటీలో అంటే?
ది గర్ల్ ఫ్రెండ్ మూవీని థియేటర్‌లో విడుదలైన 4 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే నిబంధన మేరకు నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం చేసుకున్నారు. దీనిని బట్టి డిసెంబర్ మొదటి వారంలో రష్మిక మందన్న చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే థియేట్రికల్ రన్‌ని బట్టి ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఓటీటీలో ముందుగా రావొచ్చు లేదా మరింత ఆలస్యం కావొచ్చు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











