Rajiv Gandhi: వెబ్ సిరీస్‌గా రాజీవ్ గాంధీ హత్య కేసు.. స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎందులో అంటే?

వాస్తవ సంఘటనలు, బయోపిక్స్‌కు ఓటీటీలో మంచి డిమాండ్ నెలకొన్న సంగతి తెలిసిందే. వీటిలో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ వంటి అంశాలు ఉంటే అది హాట్ కేకే. అందుకే ఈ తరహా సబ్జెక్ట్స్‌‌తోనే దర్శక నిర్మాతలు వెబ్ సిరీస్‌లుగా, సినిమాలుగా తీసుకొస్తున్నారు. అలాంటిది పొలిటికల్, క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ ఇలా అన్ని అంశాలు ఒకే సిరీస్‌లో ఉంటే దానికి తిరుగులేదని చెప్పొచ్చు.

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జీవితంలో ఇలాంటి ఎలిమెంట్స్‌కు కొదవలేదు. ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజీవ్‌ను శ్రీలంకకు చెందిన ఎల్‌టీటీఈ ఉగ్రవాదులు మానవ బాంబు ద్వారా హతమార్చారు. ఈ ఘటనను ఇతివృత్తంగా తీసుకుని ది హంట్ : ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ పేరిట వెబ్‌సిరీస్‌గా తెరకెక్కించారు. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ వివరాల్లోకి వెళితే..

భారతదేశ ఐటీ పితామహుడిగా రాజీవ్ గాంధీ
భారతదేశంలో ఐటీ విప్లవానికి నాంది పలికి దేశం నేడు టెక్నాలజీలో పురోభివృద్ధి సాధించడానికి వేశారు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ. ఆయన పాలనా కాలంలోనే దేశంలో ఐటీ, టెలికాం విప్లవానికి బలమైన పునాదులు పడ్డాయి. ప్రపంచంతో పోటీపడే స్థాయిలో భారతీయ యువత ఉండాలని కలలు కన్న ఆయన దేశంలో శక్తివంతమైన మార్పుకు బీజాలు వేశారు. 40 ఏళ్ల చిన్న వయసులోనే భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ అత్యున్నత పదవిని అధిరోహించిన పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కారు. ఎన్నో విజయాలతో మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని భావించిన రాజీవ్ గాంధీ దారుణ హత్య దేశాన్ని కుదిపేసింది.

The Hunt The Rajiv Gandhi Assassination Case OTT Release Date when to watch this web series online

రాజీవ్‌ను పొట్టనపెట్టుకున్న ఎల్టీటీఈ
1991 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 21న తమిళనాడులోని శ్రీపెరంబూదూర్‌లో రాజీవ్ గాంధీ పర్యటిస్తున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ, వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు కదులుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రాజీవ్ గాంధీ దుర్మరణం పాలయ్యారు. రాజీవ్ దారుణహత్యతో దేశ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. శ్రీలంకలోని తమిళుల కోసం పోరాడుతున్న లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) భారత ప్రధాని హోదాలో శాంతి పరిరక్షక దళాలను పంపారు రాజీవ్. తమ దేశ అంతర్గత వ్యవహారాలలో భారత్ జోక్యం చేసుకోవడం, తమపై సైన్యాన్ని పంపడంతో రాజీవ్ గాంధీపై ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాజీవ్‌ హత్యకు ఆయన పథకం రచించారు. రాజీవ్ హత్య కేసు దర్యాప్తును నాటి ప్రధాని చంద్రశేఖర్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.

రాజీవ్ హత్యపై వెబ్ సిరీస్‌
ఈ క్రమంలో రాజీవ్ గాంధీ హత్య, తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసియేషన్ కేస్ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు దర్శకుడు నగేష్ కుకునూర్. ఇందులో అమిత్ సియాల్, సాహిల్ వైద్, అంజనా బాలాజీ, గిరీష్ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రోహిత్ బానావాలికర్, శ్రీరామ్ రాజన్‌లు రచనా సహకారం అందించారు. అప్పలౌజ్ ఎంటర్‌టైన్‌మెంట్, కుకునూర్ మూవీస్ బ్యానర్‌పై ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. తాజాగా తాజాగా ది హంట్‌ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్‌లో జూలై 4 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి రాజీవ్ గాంధీ హత్యపై తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Read more about: rajiv gandhi ott news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X