OTTలోకి వచ్చేసిన సంచలన మర్డర్ మిస్టరీ... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సినిమా ఇండస్ట్రీలో నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు, సిరీసులు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీస్‌ను ఎక్కువగా రూపొందిస్తున్నారు. ఇక ఓటీటీలో ఇలాంటి స్టోరీలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెన్సేషనల్ రియల్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
సంచలనం సృష్టించిన హత్య
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు గురంచి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ కేసు అందరినీ భయభ్రంతులకు గురిచేసింది. అయితే దీనిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా తెరకెక్కించింది. 'ది ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్' పేరు మీద డాక్యూమెంటరీ రూపొందించగా... కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

అసలు ఈ షీనా బోరా కథేంటి...
అసలు ఈ డాక్యూమెంటరీ స్టోరీ ఏంటంటే... 2012లో షీనా బోరా హత్య జరిగింది. మూడేళ్ల తర్వాత ఈ ఘటన బయటకు వచ్చింది. ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్ ను ఓ కేసులో విచారణ జరపగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపేసిందని పోలీసులకు చెప్పాడు. దీంతో షీనా బోరా హత్య విషయం బయటపడింది.
తల్లి గురించి తెలుసుకున్న షీనా
ఈ కేసు దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఇంద్రాణీ మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత తన కుమార్తె షీనా, కుమారుడు మైఖెల్‌ను తన తల్లి దండ్రుల వద్ద ఉంచేది. కొన్నాళ్లకు సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుని ఇంద్రాణి అతడి నుంచి విడిపోయింది. తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖర్జియాను వివాహం చేసుకుంది. పెద్దయ్యాక తల్లి గురించి తెలుసుకున్న షీనా.. ముంబయికి వెళ్లి తల్లిని కలుసుకుంది.
షీనా మర్డర్...
పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్ కు షీనాకు పరిచయం ఏర్పడింది. అది కాస్త కొన్నాళ్లకు ప్రేమకు దారితీసింది. ఈ విషయంలో తల్లీకుమార్తెల మధ్య తరచూ గొడవలు అయ్యేవి. ఆర్థిక విభేదాలు కూడా రావడంతో.. దీంతో విసిగిపోయిన ఇంద్రాణీ.. తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో కుమార్తెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్..
మొదట ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ అనుకోగా... దర్యాప్తు పూర్తయ్యే వరకు ఓటీటీలో విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సీబీఐ బాంబే హైకోర్టును కోరింది. దీనిపై న్యాయస్థానం విచారించింది. దర్యాప్తు సంస్థతోపాటు న్యాయస్థానం వీక్షించేందుకు ముందస్తుగా ప్రదర్శించాలని నెట్ ఫ్లిక్స్ ను ఆదేశించింది. తాజాగా దీనిపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో విడుదలకు అడ్డంకులు పోయి.. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఈ డాక్యూమెంటరీని ఈ వీకెండ్ కు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.


Click it and Unblock the Notifications











