The Kerala Story 300 కోట్ల కలెక్షన్ల మూవీకి బయ్యర్లు కరువు.. ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్.. ఎక్కడ? ఎప్పుడంటే?
ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై సుదిప్టో సేన్ దర్వకత్వంలో విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన చిత్రం ది కేరళ స్టోరి. ఈ చిత్రంలో అదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రలలో నటించారు. వివాదాస్పదంగా మారిన ఈ సినిమా 2023 మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్లు, అలాగే ఓటీటీ రిలీజ్ ఎందుకు లేట్ అయిందనే వివరాల్లోకి వెళితే..
ది కేరళ స్టోరి సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 28 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరిగింది. సుమారు 35 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా ఇండియాలో 2000 స్క్రీన్లలో రిలీజైంది.

ఇక ది కేరళ స్టోరి సినిమా తొలి రోజు నుంచే భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఇండియాలో ఈ చిత్రం హిందీ వెర్షన్ 240 కోట్లకుపైగా, ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీలో 240 కోట్లు, తెలుగులో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ది కేరళ స్టోరి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. రికార్డు వసూళ్లను సాధించింది. అయితే ఓటీటీ బిజినెస్ విషయానికి వస్తే.. ఏ ఓటీటీ సంస్థ కూడా కొనడానికి ముందుకు రాలేదు. అలాగే బాలీవుడ్‌లో 8 వారాల వ్యవధి కూడా ఉండటంతో రిలీజ్ ఆలస్యమైంది.
అయితే ది కేరళ స్టోరి సినిమా ఓటీటీ రైట్స్ బిజినెస్ కాకపోవడంతో నిర్మాతలు ఈ మూవీని యూట్యూబ్‌లో రిలీజ్ చేసేందుకు కూడా వెనుకాడలేదు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ కొనడానికి ఆసక్తి చూపకపోతే యూట్యూబ్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఆ క్రమంలో ఈ సినిమా హక్కులన జీ5 ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకొన్నది.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించిన ది కేరళ స్టోరి సినిమాను చివరకు జీ5 (Zee5) సంస్థ ఓటీటీ హక్కులను సొంతం చేసుకొన్నది. ఈ సినిమాను జనవరిలో ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 12న గానీ, లేదా జనవరి 19వ తేదీన గానీ రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











