Netflix కేవలం 500 టికెట్లు అమ్ముడుపోయిన సినిమా.. డిజాస్టర్ మూవీకి ముఖం చాటేసిన ఓటీటీ!

యువ హీరో, హీరోయిన్లు అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ జంటగా నటించిన ది లేడీ కిల్లర్ (The Lady Killer) చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ ఉత్తరాదిలో క్రేజీగా జరిగినా బిజినెస్ ఊహించనంతగా జరగలేదు. దాంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఓటీటీతో భారీగా బిజినెస్ ఒప్పందం జరిగింది. దాంతో నామమాత్రంగా థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారు. అయితే బాక్సాఫీస్ వద్ద ది లేడీ కిల్లర్ దారుణంగా బోల్తా పడటంతో ప్రస్తుతం ఓటీటీ నిర్వాహకులు ముఖం చాటేస్తున్నట్టు ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..

ది లేడీ కిల్లర్ (The Lady Killer) సినిమాకు సంబంధించిన హీరో, హీరోయిన్లు, ఇతర నటీనటుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఈవెంట్లు అన్నీ కలిపి మొత్తంగా ఈ మూవీకి 45 కోట్ల రూపాయలు బడ్జెట్ అయింది. అయితే ఈ సినిమాకు కావాల్సిన దానికంటే ఈ ఓవర్‌గా బడ్జెట్ అయిందనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ముందుగానే ఓటీటీతో డీల్ చేసుకొని రిలీజ్‌కు సిద్దం చేశారు.

The Lady Killer sold 500 Tickets at box office: Netflix opposes to stream Arjun Kapoor Movie

ది లేడీ కిల్లర్ (The Lady Killer) సినిమా పరిస్థితిని ముందుగానే ఊహించిన నిర్మాతలు కేవలం ముంబై, ఢిల్లీలో కేవలం 11 స్క్రీన్లలో ప్రదర్శించేలా సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా కనీసం 500 టికెట్లు అమ్ముడుపోలేకపోవడం దారుణంగా మారింది. థియేట్రికల్ రన్‌లో కేవలం 40 వేల రూపాయలు మాత్రమే వసూలు చేసింది.

నవంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది లేడీ కిల్లర్ (The Lady Killer) చిత్రాన్ని డిసెంబర్ 29వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయడానికి అగ్రిమెంట్ జరిగింది. అయితే ప్రస్తుతం సినిమా డిజాస్టర్ కావడంతో కొనుగోలు చేసిన రేటు విషయంలో ఓటీటీ సంస్థ బేరసారాలు చేస్తున్నదని, ముందుగా కుదర్చుకొన్న ఒప్పందం ప్రకారం డబ్బు చెల్లించడానికి సుముఖంగా లేదనే వార్త బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నది.

The Lady Killer sold 500 Tickets at box office: Netflix opposes to stream Arjun Kapoor Movie

అయితే ది లేడీ కిల్లర్ (The Lady Killer) వివాదంపై నెట్‌ఫ్లిక్స్ నిర్వాహకులు స్పందించారని తెలిసింది. అయితే ఈ సినిమాను పూర్తి చేయకుండానే అసంపూర్తిగా మూవీని రిలీజ్ చేశారు. ఈ సినిమాను పూర్తిగా షూట్ చేయలేదు. అందుకే ఈ సినిమా ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గాలని నిర్ణయం తీసుకొన్నామనే విషయం వెలుగులోకి వచ్చింది.

The Lady Killer sold 500 Tickets at box office: Netflix opposes to stream Arjun Kapoor Movie

ఇక ది లేడీ కిల్లర్ (The Lady Killer) సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. సుమారు 40 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించిన ఈ చిత్రం 50 షేర్ కూడా రాబట్టలేకోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కాలంలో ఇంతటి డిజాస్టర్ పొందిన చిత్రం మరోటి లేదనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X