The Legend OTT రిలీజ్.. జెట్ స్పీడ్ లోనే రాబోతున్న శరవణన్ సినిమా

డబ్బున్న కుటుంబంలో నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే వారు ఇటీవల కాలంలో ఏకంగా పాన్ ఇండియా సినిమాలతో వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నారు. ఇక తమిళనాడు రాష్ట్రంలో అత్యంత దనవంతులైన బిజినెస్ మెన్స్ లో ఒకరైన అరుల్ శరవణన్ ఇటీవల ఒక సినిమాను అందరిని ఆశ్చర్య పరిచే విధంగా విడుదల చేశాడు. శరవణ స్టోర్స్ యజమాని అరుళ్ శరవణన్ హీరోగా నటించిన ది లెజెండ్ సినిమాను ఆయనే సొంతంగా నిర్మించడం జరిగింది.

ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా ఎక్కువగా ట్రోల్ మెటీరియల్ లాగానే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ఇక సినిమా ప్రపంచవ్యాప్తంగా 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా నెగిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ది లెజెండ్ తెలుగులో కూడా కొన్ని థియేటర్లలో హడావిడిగానే విడుదలైంది. ఇక మొత్తానికి ది లెజెండ్ సినిమా ఓటీటీ లో ఎప్పుడు రాబోతోంది అనే విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఒక ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది.

The legend movie OTT Release date details

ఇక ది లెజెండ్ సినిమా ఓటీటీ హక్కులు డిస్ని ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ అంతటి బడా సంస్థ చేతిలో సినిమా పడింది అంటే ఆశ్చర్యమే అని చెప్పాలి. ఇక హాట్ స్టార్ లో ఈ సినిమా ఆగస్టు నెలలో చివరి వారంలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మరి ది లెజెండ్ సినిమా ఓటీటీ లో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. ఇక సినిమాలో పెద్దగా ఆశ్చర్య పరిచే ఎలిమెంట్స్ ఏమి లేవని రివ్యూలు చాలానే వచ్చాయి. ముఖ్యంగా శరవణన్ నటించిన విధానంపై ట్రోల్స్ కూడా చాలానే వచ్చాయి. కానీ అదే ఒక విధంగా ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ఓటీటీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X