OTTలోకి వచ్చేసిన ది లెజెండ్ ఆఫ్ హనుమాన్... స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా ఒకటే పేరు వినిపిస్తుంది. అదే హనుమాన్. థియేటర్లలో ఈ సినిమా దుమ్మురేపుతుంది. నార్త్, సౌత్ ఆడియెన్స్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. అయితే ఈ సినిమాకు పోటీగా మరో హనుమాన్ ఓటీటీలోకి వచ్చేశాడు. అదేంటి అనకుంటున్నారా. హనుమంతుడి కథతో లెజెండ్ ఆఫ్ హనుమాన్ యానిమేషన్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్స్ వచ్చాయి. ఇక మూడో సీజన్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా కూడా ఓ రేంజ్ లో వినిపిస్తున్న సినిమా "హను మాన్" అని తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరో కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఇక తేజ సజ్జా హీరోగా ఈ మూవీలో నటించారు. ఇక ఈ సినిమా తెలుగు నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమా కావడంతో మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

అయితే హనుమాన సినిమాకు పోటీగా మరో హనుమాన్ వచ్చింది. మన హనుమంతుడి కథతో లెజెండ్ ఆఫ్ హనుమాన్ యానిమేషన్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో ఇప్పటికే రెండు సీజన్స్ వచ్చి సూపర్ హిట్టుగా నిలిచంది. ఇక ఈ సిరీస్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇప్పుడు మరో సీజన్ ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 12 నుంచి మూడో సీజన్ ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.
ప్రస్తుతం థియేటర్స్ లో హనుమాన్ అదరగొడుతుంటే మరో పక్క మరో "హనుమాన్" ఓటీటీలోకి రావడం ఆసక్తికరంగా మారింది. దీనితో ఒకే రోజు ఇద్దరు హను మాన్ లు పోటీకి వచ్చారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇంట్రెస్టింగ్ గా ఓ పక్క బిగ్ స్క్రీన్స్ పై హను మాన్ కి ఎలా అయితే రెస్పాన్స్ వస్తుందో ఓటిటిలో కూడా హనుమాన్ సిరీస్ కి కూడా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని తెలుస్తోంది.

ఇక ఈ సిరీస్ విషయానికి వస్తే... గత రెండు సీజన్స్ కంటే... ఆసక్తికరమైన కథనం, అద్భుతమైన గ్రాఫిక్స్, మిక్స్డ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కొత్త సీజన్‌లో పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు మేకర్స్. మీరు థియేటర్లలో ఆ హనుమాన్ ను మిస్ అయితే.. ఇంట్లోనే కూర్చొని ఈ హనుమాన్ ను వీక్షించేయండి.


Click it and Unblock the Notifications











