Extraction 2: మరో బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెల్ ఎక్స్ ట్రాక్షన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతోందంటే?

నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యే హాలీవుడ్ మూవీస్ లో ఎక్కువ మందికి రీచ్ అయ్యి, మంచి సక్సెస్ అయిన చిత్రం అంటే ఎక్స్ ట్రాక్షన్. ఈ మూవీ 2020లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి అప్పట్లో విశేషమైన ఆదరణ లభించింది. మరల మూడేళ్ళ తర్వాత దానికి సీక్వెల్ గా ఎక్స్ ట్రాక్షన్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. థోర్ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా రీచ్ అయినా క్రిష్ హేమ్స్ వర్త్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు.

ఇక మొదటి పార్ట్ లో కూడా అతనే హీరోగా నటించాడు. ఇక యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో పాటు లవ్ అండ్ ఫామిలీ ఎమోషన్స్ తో ఈ చిత్రాన్ని హర్ గ్రేవ్ తెరకెక్కించారు. జో రస్సో ఎక్స్‌ట్రాక్షన్ 2 కోసం రచయితగా పనిచేశాడు. జో రస్సో, ఆంథోనీ రస్సో నేతృత్వంలోని నిర్మాణ సంస్థ యూఏజీబీఓ ఈ సినిమాని నిర్మిస్తోంది. తాజా గా ఈ సినిమా ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

 The most awaited Netflix movie Extraction 2 will be released on June 16 on Netflix

ట్రైలర్ గా తండ్రికొడుకుల సెంటిమెంట్ ని హైలైట్ చేశాడు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ నెల 16న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో టెలికాస్ట్ కానుంది. ట్రైలర్ కి సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. కచ్చితంగా ప్రేక్షకులకి ఈ మూవీ నచ్చితుందని భావిస్తునానరు.

హాలీవుడ్ సినిమాలు ఈ మధ్యకాలంలో ఇండియన్ మార్కెట్ లో కూడా సత్తాచాటుతూ ఉన్నాయి. ఓటీటీ ఛానల్స్ వచ్చిన తర్వాత భాష సరిహద్దులు పూర్తిగా చేరిపోయాయి. ఎక్కడో రిలీజ్ అయినా సినిమా లేదా వెబ్ సిరీస్ ని వేరే భాషలకి చెందిన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా అయితే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తర్వాత ప్రపంచ స్థాయి గుర్తింపుని సొంతం చేసుకుంది. ఇక నెట్ ఫ్లిక్స్ మోస్ట్ సక్సెస్ ఫుల్ చిత్రాల జాబితాలో ఉన్న ఎక్స్ ట్రాక్షన్ కి సీక్వెల్ లో రాబోతోన్న ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X