OTTలోకి వచ్చేసిన వెన్నులో వణుకు పుట్టించే దెయ్యం సినిమా.. ఎందులో చూడాలంటే?

ఓటీటీ ప్రేక్షకుల కోసం మరో హారర్ మూవీ వచ్చేసింది. వెన్నులో వణుకు పుట్టించే దెయ్యం సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. హారర్, థ్రిల్లర్ సినిమాలు అంటే ప్రేక్షకులకు ఎక్కువ ఇంట్రెస్ట్. ముఖ్యంగా దెయ్యం సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థలో ఓ దెయ్యం సినిమా భయపెట్టేందుకు రెడీ అయిపోయింది. ఆ వివరాలు ఈ స్టోరీలో లుక్కేద్దాం.

దెయ్యం సినిమాలంటే చాలా మందికి మక్కువే. భయపడుతూనే చూస్తుంటారు. అలాంటి సినిమాలను చూసి భయపడుతూనే ఎంజాయ్ చేస్తూంటారు. ఇక మనకు హార్రర్ సినిమాలు అనగానే గుర్తుకు వచ్చేవి హాలీవుడ్ సినిమాలు. తెలుగులోనూ భయపెట్టే సినిమాలు వస్తున్నప్పటికీ... వెన్నులో వణుకుపుట్టించే సినిమాలంటే మాత్రం హాలీవుడ్ మూవీస్ అని చెప్పవచ్చు. ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లోని ఓ హార్రర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది.

The Nun 2 Horror Movie Telugu Version Now Streaming on Jio Cinema OTT Full Details Here

వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ నుంచి దెయ్యాల సినిమాలు చాలా వచ్చాయనే సంగతి తెలిసిందే. ది కంజూరింగ్, అనాబెల్లె, ఈవిల్ డెడ్, లైట్స్ అవుట్ వంటి ఫ్రాంచైజీస్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇదే బ్యానర్ గతంలో 2018లో వచ్చిన మరో హారర్ చిత్రం ది నన్. ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా వణికించింది. అదే విధంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇక ది నన్ సినిమాకు మంచి రెస్పాన్స్ రాగా.. ఆ సినిమా వచ్చిన ఐదు సంవత్సరాలకు సీక్వెల్ వచ్చింది. అదే ది నన్ 2. ఈ చిత్రాన్ని జేమ్స్ వాన్, పీటర్ సాఫ్రన్, జుడ్సన్ స్కాట్ సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు దర్శకత్వం మైఖేల్ చేవ్స్ వహించాడు. ఈ మూవీలో సిస్టర్ ఇరేనే అనే ప్రధాన పాత్రలో టైస్సా ఫార్మి నటించి ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం 2023లో సెప్టెంబర్ 8న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

The Nun 2 Horror Movie Telugu Version Now Streaming on Jio Cinema OTT Full Details Here

ది నన్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు కూడా కోట్ల వర్షం కురిసింది. థియేటర్లలో ఈ హార్రర్ సినిమా ప్రేక్షకులను వణికించింది. ఓ రేంజులో భయపెట్టేసింది. థియేటర్లలో భయపెట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. ది నన్ 2 మూవీ గతేడాది అక్టోబర్ 19న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ఇప్పుడు మన దేశంలో ఓటీటీ ప్లా్ట్ ఫామ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ది నన్ 2 సినిమా జియో సినిమాలో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళంలో భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. అసలు ఈ సినిమా కథ విషయానికి వస్తే... దెయ్యంగా మారిన ఓ అందమైన అమ్మాయి కథనే ఈ ది నన్ 2. ఇంతకీ ఆ అమ్మాయి ఎందుకు అలా దెయ్యంగా మారింది ?.. ఆమె కథేంటీ ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాలి. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన హారర్ మూవీ ప్రియులు ఇప్పుడు ఈ సినిమాను ఇంట్లోనే చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X