OTT News: ఈ ఏడాది ఓటీటీలో ధురంధర్‌‌ ప్రభంజనం.. టాలీవుడ్‌ నుంచి టాప్ 10లో ఆ డిజాస్టర్ మూవీ!

కరోనా సమయంలో ఇండియాలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీలు ప్రస్తుతం భారతీయులకు నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. థియేటర్‌లలో సినిమాల చూడాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్ధితుల్లో తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమాలు చూసే అవకాశాన్ని ఓటీటీలో కలిపిస్తుండటంతో ప్రేక్షకులు ఓటీటీల వైపు ఆకర్షితులు అవుతున్నారు. ప్రతివారం ఓటీటీలో ఒరిజినల్ కంటెంట్‌తో పాటు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వస్తుండటంతో ప్రేక్షకులు వాటి కోసం ఎగబడుతున్నారు. పైగా భారతీయ భాషలతో పాటు ప్రపంచంలోని అన్ని భాషలకు చెందిన కంటెంట్ అందుబాటులోకి వస్తుండటంతో ఓటీటీ రంగం దూసుకెళ్తోంది.

నిర్మాతలకు ఓటీటీలు అదనపు ఆదాయన్ని అందించే సాధనాలుగానూ మారుతున్నాయి. సినిమా రిలీజ్‌కు ముందే భారీ రేటుతో ఓటీటీ నిర్వాహకులు ఆఫర్ ఇస్తుండటంతో మేకర్స్‌ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థియేటర్‌లో సరిగా పర్ఫార్మ్ చేయని సినిమాలు.. ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌లో రికార్డ్ వ్యూస్ సాధిస్తున్నాయి. ప్రతియేటా భారత్‌లో వందల కొద్దీ సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో 2026లో ఇప్పటి వరకు ఏయే సినిమాలు ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయో ఓ ఛానెల్ విశ్లేషించింది. ఆ వివరాల్లోకి వెళితే..

The Raja Saab Becomes One of the Most Watched OTT Movies of 2026 Here is Top 10 Films List

2026లో టాప్‌ ప్లేస్‌ను దక్కించుకున్న సినిమాగా రణ్‌వీర్ సింగ్ - ఆదిత్య ధర్‌ల ధురంధర్ మొదటి భాగం నిలిచింది. జనవరి 30వ తేదీన ధురంధర్ ఫస్ట్ పార్ట్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చి రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. ఇప్పటి వరకు ఏకంగా 31.1 మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ తర్వాతి స్థానలో ధురంధర్ 2 : ది రివెంజ్ నిలిచింది. జూన్ 5న జియో హాట్ స్టార్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా రెండు వారాలు గడిచేసరికి ఏకంగా 16.9 మిలియన్ వ్యూస్‌‌తో చరిత్ర సృష్టించింది. రానున్న రోజుల్లో ధురంధర్ 2 ఫస్ట్ ప్లేస్‌ని దక్కించుకున్నా ఆశ్చర్యపడనక్కర్లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆ తర్వాత ప్లేస్‌లో కొంకణ సేన్ శర్మ, ప్రతిభ రత్న నటించిన అక్యూజ్డ్ నిలిచింది. ఈ సినిమా ఫిబ్రవరి 27న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పటి వరకు ఈ మూవీ 16.6 మిలియన్ వ్యూస్ రాబట్టింది. అనంతరం మేడ్ ఇన్ కొరియా (నెట్‌ఫ్లిక్స్- 13.5 మిలియన్ వ్యూస్), హక్ (నెట్‌ఫ్లిక్స్ - 11.3 మిలియన్ వ్యూస్), మర్దానీ 3 (నెట్‌ఫ్లిక్స్- 10.7 మిలియన్ వ్యూస్), కర్తవ్య (నెట్‌ఫ్లిక్స్- 10.3 మిలియన్ వ్యూస్) దక్కించుకోగా.. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ 8వ స్థానంలో నిలిచింది.

సంక్రాంతి కానుకగా జనవరి 9న ది రాజాసాబ్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల రూపాయల నెట్.. 123 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాడు ప్రభాస్. 400 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కనీసం ఒక్క ఏరియాలోనూ బ్రేక్ఈవెన్ కాకపోగా.. ది రాజాసాబ్ కారణంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. తద్వారా ప్రభాస్ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.

థియేటర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన ది రాజాసాబ్ మూవీ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మార్చి 6వ తేదీ నుంచి హిందీలో ది రాజాసాబ్ ఓటీటీలో విడుదల అయ్యింది. అయితే అనూహ్యంగా ఓటీటీలో ఈ సినిమాకు మంచి వ్యూస్ దక్కడం విశేషం. ది రాజా సాబ్‌కు ఇప్పటి వరకు 10.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా తర్వాత తేరే ఇష్క్ మైన్ (నెట్‌ఫ్లిక్స్ - 9.7 మిలియన్ వ్యూస్), సుబేదార్ (అమెజాన్ ప్రైమ్ - 9.6 మిలియన్ వ్యూస్) రాబట్టి టాప్ 10లో నిలిచినట్లుగా సదరు ఛానెల్ వెల్లడించింది.

Read more about: the raja saab Dhurandhar netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X