The Raja Saab OTT: ప్రభాస్ 'రాజాసాబ్' ఓటీటీ డీటైల్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
The Raja Saab OTT release: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)నటించిన భారీ బడ్జెట్ మూవీ ది రాజాసాబ్ (The Raja Saab) ఎట్టకేలకు జనవరి 9న థియేటర్లలోకి వచ్చింది. పండగ సీజన్ బజ్‌తో పాటు, ప్రభాస్‌ను ఓ కొత్త అవతార్‌లో చూడాలనే అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. సినిమా బాగుందా? లేదా? అన్నదానిపై కాసేపు పక్కనబెడితే... ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో మిశ్రమ స్పందన (Mixed Talk) వినిపిస్తోంది. వీకెండ్ ముగిసే సరికి అసలు ట్రెండ్ ఏంటన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
దర్శకుడు మారుతి (Maruthi)ఈ సినిమాలో హారర్, ఫాంటసీ, కామెడీ జానర్లను మేళవిస్తూ ప్రభాస్‌ను లైట్, ప్లేఫుల్ క్యారెక్టర్‌లో చూపించారు. 'జన నాయగన్' వాయిదా పడటంతో సంక్రాంతి బరిలో 'ది రాజాసాబ్'కు సోలో రిలీజ్ విండో దక్కింది. అయితే ఓపెనింగ్ డే తర్వాత వచ్చిన రివ్యూలు మిశ్రమంగా ఉండటంతో ఇండస్ట్రీ వర్గాలు వీకెండ్ కలెక్షన్లపై కన్నేసి ఉన్నాయి. ప్రాధామిక అంచనాల ప్రకారం తొలి రోజు వసూళ్లు రూ.70 కోట్లకు వరకు రావొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కథా నేపథ్యం
ఇక కథ విషయానికి వస్తే... దేవనగర సంస్థానానికి చెందిన జమీందారు భార్య గంగాదేవి (జరీనా వాహబ్) కొన్ని కారణాల వల్ల మనవడు రాజు అలియాస్ రాజాసాబ్ (ప్రభాస్)తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటుంది. మతిమరుపు సమస్య ఉన్నా భర్త కనకరాజు (సంజయ్ దత్)ను మాత్రం మర్చిపోదు. కలల్లో కనిపిస్తున్న తాతను వెతికి తీసుకురమ్మని మనవడిని కోరడంతో, రాజాసాబ్ నర్సాపురం అడవుల్లోని రాజమహల్‌కు చేరుకుంటాడు. మార్మిక విద్యలు తెలిసిన కనకరాజుతో రాజాసాబ్ ఎదురెదురుగా నిలిచే సందర్భాలు, భైరవి (మాళవిక మోహనన్), బెస్సీ (నిధి అగర్వాల్), అనిత్ (రిద్ధి కుమార్)లతో హీరోకు ఉన్న సంబంధాలే కథలో కీలకం.
ఓటీటీ డీటైల్స్: జియో హాట్‌స్టార్ డీల్
ఇప్పుడు అసలు హాట్ టాపిక్ అయిన ఓటీటీ విషయానికి వస్తే.. 'ది రాజాసాబ్' డిజిటల్ హక్కులను జియో హాట్ స్టార్ (Jio Hotstar) ముందుగానే దక్కించుకున్నట్లు సమాచారం. అన్ని భాషల ఓటీటీ రైట్స్‌ను సుమారు రూ.160 కోట్లకు కొనుగోలు చేసినట్లు ట్రేడ్ టాక్. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాలకే స్ట్రీమింగ్ డీల్ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే.. ఫిబ్రవరి తొలి వారంలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉండగా, హిందీ వెర్షన్ మాత్రం కాస్త ఆలస్యంగా అందుబాటులోకి రావొచ్చని సమాచారం.
ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దానికి 'రాజాసాబ్ సర్కస్ 1935'అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రమోషన్లలో చూపించిన ప్రభాస్ వృద్ధుడి గెటప్, ఆ ఫైట్ సీక్వెన్స్‌ను సినిమాలో పూర్తిగా తొలగించడం చర్చకు దారితీసింది. కావాలనే తొలగించారా? లేదా సీక్వెల్ కోసం దాచారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. సుమారు రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల కాలంలో వచ్చిన అత్యంత ఖరీదైన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది.ఇందులో పెద్ద భాగం ప్రభాస్ రెమ్యునరేషన్‌కే వెచ్చించారని ఇండస్ట్రీ వర్గాల మాట.
ఎండ్ క్రెడిట్స్‌లో పార్ట్ 2 కన్ఫర్మేషన్ రావడంతో అభిమానుల్లో ఉత్సుకత మరింత పెరిగింది. దర్శకుడు మారుతి కూడా సీక్వెల్‌పై స్పందిస్తూ... ఇది మొదటి భాగానికి నేరుగా కొనసాగింపు కాదని, అదే హారర్ జానర్‌లో కొత్త కథతో యూనివర్స్‌ను విస్తరించడమే లక్ష్యమని తెలిపారు. ఇలా 'ది రాజాసాబ్' థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌తో నడుస్తున్నప్పటికీ, ప్రభాస్ క్రేజ్, పండగ సీజన్ అడ్వాంటేజ్ సినిమాను నిలబెట్టే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక ఓటీటీ రిలీజ్ తేదీ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో వేచి చూడాలి. వీకెండ్ ట్రెండ్, వర్డ్ ఆఫ్ మౌత్ ఆధారంగానే 'ది రాజాసాబ్' బాక్సాఫీస్ ప్రయాణం ఎలా ఉండబోతోందో తేలనుంది.


Click it and Unblock the Notifications











