The Rajasaab OTT: ప్రభాస్ అభిమానులకు షాక్.. ది రాజాసాబ్ ఓటీటీ స్ట్రీమింగ్‌లో ట్విస్ట్, ఏం జరిగిందంటే?

మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ ది రాజాసాబ్. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇటీవల ఈ సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్‌లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే రాజాసాబ్ ఓటీటీకి సంబంధించి ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..

ది రాజాసాబ్ తారాగణం
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా ది రాజాసాబ్ నిర్మించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌‌లు ప్రభాస్ సరసన హీరోయిన్‌లుగా నటించారు. సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ది రాజాసాబ్‌కు కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌‌గా పనిచేశారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ అందించారు.

The Raja Saab OTT Streaming Confusion Why the Prabhas Film Is Not Available in the USA

ది రాజాసాబ్ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ది రాజాసాబ్‌కు 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే.. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు మేర, హిందీ రైట్స్ 30 కోట్లకు, తమిళ హక్కులు 8 కోట్ల రూపాయలు, కర్ణాటక రైట్స్ 15 కోట్ల రూపాయలు, కేరళలో 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో ది రాజాసాబ్‌ మూవీకి ఓవరాల్ బిజినెస్ సుమారుగా 250కు పైగా కోట్ల మేర వాల్యూ కట్టాయి. దాంతో ప్రభాస్ మూవీ లావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 500 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి.

ది రాజాసాబ్ కలెక్షన్స్
ప్రభాస్ మూవీ థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇండియాలో 146.4 కోట్ల రూపాయల నెట్.. 174.14 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్, ఓవర్సీస్‌లో 34.25 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 208.39 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది. తమిళనాడులో 14.67 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 122.84 కోట్ల రూపాయలు, 2.96 కోట్ల రూపాయలు, 40 లక్షల రూపాయలు, హిందీలో 29.88 కోట్ల రూపాయలు వసూలైనట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఏ ఏరియాలోనూ బ్రేక్ఈవెన్ కాకపోగా.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చాయి.

ది రాజాసాబ్ ఓటీటీ
ది రాజాసాబ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ ట్రేడ్ వాల్యూ దాదాపు 160 కోట్ల రూపాయలకు పైగా పలికినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ది రాజాసాబ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ విషయానికి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ది రాజాసాబ్... భారత్ సహా కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే అమెరికాలో మాత్రం ఈ సినిమా స్ట్రీమింగ్ కాకపోవడంతో ఎన్ఆర్ఐ ఆడియన్స్‌లో గందరగోళం నెలకొంది. దీని వెనుక కారణాలు పరిశీలిస్తే..

యూఎస్ఏలో స్ట్రీమింగ్‌పై గందోరగోళం
జియో హాట్‌స్టార్ ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే పనిచేయడమే ఇందుకు కారణం. అమెరికాలోని ప్రేక్షకులకు ఇది అందుబాటులో లేదు. సాధారణంగా హాట్‌స్టార్ లోని కంటెంట్ ఎక్కువగా భాగం హులూ యాప్ ద్వారా విదేశాలలో పంపిణీ చేయిస్తుంది. దీని వల్లే అమెరికాలో ది రాజాసాబ్ స్ట్రీమింగ్ కాలేదు. ఇది ప్రభాస్ అభిమానులను, ఎన్ఆర్ఐ ఆడియన్స్‌లను నిరాశపరిచింది. దీంతో ది రాజాసాబ్ స్ట్రీమింగ్ విషయంలో గందరగోళం నెలకొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ స్పందించి అమెరికాలో ది రాజాసాబ్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై స్పష్టత ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.

More from Filmibeat

Read more about: the raja saab prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X