The Raja Saab in OTT: ఓటీటీలోకి ది రాజాసాబ్.. ప్రభాస్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సిబుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ది రాజాసాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా కొట్టింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఫాంటసీ, హారర్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. భారీ అంచనాలతో ఈ చిత్రం జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. అయితే ఈ చిత్రం తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. అయితే నెటిజన్లు ట్రోలింగ్, అభిమానుల ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో చూసింది.

అయితే సినిమా కంటెంట్ విషయంలో పొరపాట్లు గ్రహించిన చిత్ర యూనిట్.. ఆ తర్వాత వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి.. కొన్ని సీన్లు ఎడిట్ చేసి.. మరొకొన్ని సీన్లు జోడించి సినిమాను ఫ్రెష్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల మనసును దోచుకోలేకపోయింది. పర్యవసానంగా ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని బాక్సాఫీస్ వద్ద చవి చూసింది.

The Raja Saab to Stream on OTT

ది రాజాసాబ్ చిత్రం సుమారుగా 400 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు దర్శకుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత టాక్ ప్రతికూలంగా మారడంతో కలెక్షన్లు కూడా భారీగా పడిపోయాయి. చివరకు ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసింది. ఏపీ, తెలంగాణలోనే ఈ చిత్రం 102 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా దాదాపు 200 కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.

అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకొన్నది. ఈ మూవీ నిర్ణీత గడువు కంటే ముందే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు అదనంగా కొంత్ మొత్తాన్ని చెల్లించారు. దాంతో అగ్రిమెంట్ చేసుకొన్న డేట్ కంటే ముందే వస్తుంది. ఈ సినిమాను ముందుగా ఓటీటీలో తీసుకొచ్చేందుకు సుమారుగా 20 కోట్ల రూపాయలు జియో హాట్ స్టార్ అదనంగా ఇచ్చిందనే వార్తలు బిజినెస్ సర్కిల్స్‌లో ప్రచారం అయ్యాయి.

ఇదిలా ఉండగా, ది రాజాసాబ్ చిత్రం జియో హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 6వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ మేరకు ఆ సంస్థ అధికారికంగా డేట్ ప్రకటించింది. అయితే థియేట్రికల్‌లో చూడలేకపోయిన వారు ఓటీటీలో చూసేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకొంటుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: the rajasaab prabhas maruthi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X