The Rana Daggubati Show: రానా టాక్ షోకు వచ్చే గెస్ట్‌లు వీళ్లే.. పెళ్లి, పిల్లలపై నాగచైతన్య కామెంట్స్ వైరల్
The Rana Daggubati Show: మాజీ స్టార్ కపుల్స్ నాగ చైతన్య - సమంత లు ఎందుకు విడిపోయారు? వారి విడాకులకు కారణమేంటీ? అనే ప్రశ్నలకు ఇప్పటి వరకూ సరైన సమాధానం దొరకడం లేదు. కానీ, పిల్లల విషయంలో వీరి మధ్య వివాదాలు తతెత్తాయనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. అవి అన్ని రూమార్స్ అనే విషయం తెలుస్తోంది. తాజాగా హీరో నాగ చైతన్య 'ది రానా దగ్గుబాటి షో' లో పాల్గొని పిల్లలు కావాలని ఉందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీరు కూడా ఓ లూక్కేయండి.
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్ గా 'ది రానా దగ్గుబాటి షో' అనే సెలబ్రిటీ టాక్ షో నిర్వహిస్తున్నారు. ఈ టాక్ షో మొదటి ఎపిసోడ్ నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నది. తాజా ఈ షోకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ షోలో గెస్టులు ఎవరెవరు? రాబోతున్నారంటూ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ షోలో .. నాగచైతన్య శ్రీ లీల, సిద్దు జొన్నలగడ్డ, నాచురల్ స్టార్ నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్, డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి, యంగ్ హీరో తేజ, లక్కీ భాస్కర్ హీరో దుల్కర్ సల్మాన్, కాంతారావు రిషబ్ శెట్టి, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ది రానా దగ్గుబాటి షో ప్రోమోలో చూస్తే..షోలో పాల్గొన్న సెలబ్రిటీలు తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్ సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. 'నా ఫ్యాన్స్ వాడిని తిట్టారు.. వాడి ఫ్యాన్స్ నన్ను తిట్టారు' అంటూ ఫ్యాన్ వార్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. హీరో నాని మాట్లాడుతూ.. 'మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా ? మీరు ఇద్దరు' అంటూ.. రానాకు సబ్జాకు సవాల్ విసిరాడు. రానా షోలో కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా దర్శనమిచ్చారు. గాడ్ డస్ నాట్ సెన్సార్.. అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ కామెంట్స్ చేస్తారు.
'బాహుబలి సినిమా చేసేటప్పుడు ఇలాంటి ఆఫీసు ఎందుకు పెట్టలేదు సార్ ' అని రాజమౌళిని ప్రశ్నించగా..' అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. మనీ ప్రాబ్'లం అంటూ రాజమౌళి ఫన్నీ రిప్లే ఇస్తారు. ఈ షోలో డీజే టిల్లు ఫెమ్ సిద్దు జొన్నలగడ్డ కూడా తనదైన స్టైల్ లో ఫన్నీ కామెంట్స్ చేస్తూ నవ్వుల పువ్వులు పూయించారు.
Unfiltered, unscripted.. and unforgettable! 🤩#TheRanaDaggubatiShowOnPrime, New Series, Nov 23 only on @PrimeVideoIN @SpiritMediaIN @NameisNani @priyankaamohan @tejasajja123 @sreeleela14 #SidhuJonnalgadda @dulQuer @Meenakshiioffl@chay_akkineni #SumanthKumar #MiheekaDaggubati… pic.twitter.com/aS8CNztVcQ
— Rana Daggubati (@RanaDaggubati) November 15, 2024
హీరో నాగచైతన్యను రానా ఎక్కువగా పర్సనల్ విషయాలను అడినట్టు తెలుస్తోంది.'నీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండాలని అనుకుంటున్నావ్ ? ' అని రానా అడగగా.. పిల్లలతో మ్యారేజ్ లైఫ్ ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటునన్న రిప్లే ఇచ్చారు. వెంటనే రానా రియాక్ట్ అయి.. 'పిల్లలు అంటే ఎంత మంది వెంకీమామ మాదిరిగా నలుగురు ఉండాలా? ' అని రానా మరో ప్రశ్నవేశాడు.
అంతలేదు అంటూ చైతు రిప్లే ఇస్తాడు. నాగచైతన్యకు కారులో ఉన్న వస్తువుల్ని చూపించగానే..' అరేయ్ ఎంట్రా ఇది' అంటూ షాకింగ్ రియాక్షన్ ఇస్తాడు. గతంలో సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు పిల్లలను కనాలని ఉందని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరు కామెంట్స్ పరిశీలిస్తే.. సామ్ చైతూల పిల్లల కారణంగా విడిపోయారని వచ్చిన వార్తలు రూమార్స్ అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











