The WARRIORR OTT: ఆ ఓటీటీలోకి రామ్ మూవీ.. నెల కూడా కాకముందే స్ట్రీమింగ్
సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. మార్కెట్‌ను పెంచుకోవడంతో పాటు ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇక, ఆ మధ్య కొన్ని పరాజయాలతో సతమతం అయిన రామ్.. 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే అతడు 'రెడ్' అనే సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.
ఫుల్ ఫామ్‌లో ఉన్న రామ్ పోతినేని ఇటీవలే కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామీతో కలిసి 'ది వారియర్' అనే సినిమాలో నటించాడు. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా జూలై 14వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకే ఈ సినిమాను హీరో రామ్ పోతినేని స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన రేంజ్‌కు తగ్గట్లుగానే 'ది వారియర్' సినిమాను ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీగానే జరిగింది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ది వారియర్' మూవీ రామ్ పోతినేని కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. కానీ, ఆరంభంలోనే దీనికి మిక్స్‌డ్ టాక్ రావడం కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. దీంతో ఏపీ, తెలంగాణలో అంతగా కలెక్షన్లు రావడం లేదు. అలాగే, తమిళంలోనూ ఈ సినిమాకు ఆదరణ కరువైంది. దీంతో ఈ సినిమాకు రెండు వారాల్లో చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు వరకూ షేర్, రూ. 38 కోట్లు వరకూ గ్రాస్ వచ్చింది. ఇక, ఈ సినిమా విజయం సాధించాలంటే దాదాపు 17 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











