OTT: ఓటిటిలో జాన్వీ కపూర్ మూవీ.. దేవర హీరోయిన్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?

ఇప్పుడు టోటల్ ఇండియన్ సినిమా మార్కెట్ దగ్గరే తెలుగు సినిమా ఏ రేంజ్ లో సత్తా చాటుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనితో తెలుగు సినిమాలో వర్క్ చెయ్యాలని అలాగే తెలుగు దర్శకులు, హీరోలతో వర్క్ చెయ్యాలని నార్త్ స్టార్స్ ఇప్పుడు తహతహలాడుతున్నారు. కాగా ఈ క్రమంలోనే చాలా మంది హీరోయిన్స్ సౌత్ ఎంట్రీని గడిచిన కొన్నేళ్లలో తెలుగు సినిమాలు తెలుగు హీరోలతో ఇచ్చేసారు.

బాలీవుడ్ శ్రద్ధా కపూర్, ఆలియా భట్ అలాగే ఇప్పుడు మరో హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇపుడు తెలుగు సినిమా ఎంట్రీ ఇచ్చింది. అలనాటి నటి శ్రీదేవి వారసురాలిగా తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సంచలన ఎంట్రీని ఈ సెప్టెంబర్ 27న జాన్వీ కపూర్ అందించింది.

Theaters and ott Janhvi kapoor two movies releases on same day

కాగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఆమె పెట్టుకోగా నేడు థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇదే రోజున తమ మరో కొత్త సినిమాతో అయితే ఓటిటిలో పలకరించింది అని చెప్పాలి. జాన్వీ కపూర్ కి ఎంత గ్లామర్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ఆమెకి అంత పెద్ద హిట్ రికార్డ్స్ అయితే లేవు.

అలా కేవలం కొన్ని రోజులు కితమే హిందీలో ఈమె నడిచిన ఓ స్పై సస్పెన్స్ థ్రిల్లర్ అయితే థియేటర్స్ లోకి వచ్చింది కానీ అది ప్లాప్ అయ్యింది. దీనితో జాన్వీ హిట్ కి ఇంకా ఎదురు చూపులు తప్పలేదు.

కాగా ఆ సినిమానే "ఉలాజ్హ్". సుధాన్షు సరియా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో జాన్వీ ఓ స్పై గా నటించగా ఈ సినిమా మంచి స్పై సస్పెన్స్ ఎలిమెంట్స్ తో వచ్చింది. మరి ఈ సినిమా తన భారీ చిత్రం దేవర తో పాటుగా ఒకేరోజు రిలీజ్ కి వచ్చేసింది.

Theaters and ott Janhvi kapoor two movies releases on same day

అటు థియేటర్స్ లో ఈ చిత్రం దేవర విడుదల అయితే "ఉలాజ్హ్" వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో అయితే అందుబాటులోకి వచ్చేసింది. సో ఇలా ఒకే రోజు ఈ హాట్ బ్యూటీ తాలూకా రెండు సినిమాలు తన ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు వచ్చాయని చెప్పొచ్చు.

కాగా "ఉలాజ్హ్" నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతానికి హిందీలో మాత్రమే ఉంది. మరి భాషా బేధం లేకుండా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో అయినా స్పై సస్పెన్స్ థ్రిల్లర్ లాంటివి చూడాలి అనుకువారు నెట్ ఫ్లిక్స్ లో ఒక లుక్ వేయవచ్చు. ఇక మరోపక్క దేవర విషయంలో జాన్వీ కపూర్ అనుకున్నట్టుగానే తన గ్లామర్ షోతో మంచి మార్కులే కొట్టేసింది. ఇంకా ఈ సినిమా తర్వాత తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన కూడా నటిస్తుండగా ఈ సినిమా అతి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది. అలాగే ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ సినిమాలో జాన్వీ కపూర్ కి ఎలాంటి పాత్ర దక్కుతుందో చూడాలి.

More from Filmibeat

Read more about: janhvi kapoor jr ntr ulajh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X