This Week Theatre and OTT Releases : 12 సినిమాలు సిద్ధం.. థియేటర్లు, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ బద్దలే
ఈ వారం ఏప్రిల్ 27 వరకు థియేటర్లలో థియేటర్లు ఓటీటీలోకి రాబోయే సినిమాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఏకంగా 12 సినిమాలు అటు థియేటర్, ఇటు ఓటీటీలో విడుదల కాబోతుండటం విశేషం. క్రైమ్, యాక్షన్, యూత్ పుల్ ఎంటర్ టైనర్లు రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఈ వీక్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందనుంది. ఇంతకీ ఏఏ చిత్రాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి.. ఏఏ చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయనే వివరాల్లోకి వెళితే..
1. సారంగపాణి జాతకం (Sarangapani Jathakam)
బలగం, కోర్టు వంటి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న ప్రియదర్శి తాజాగా నటించిన చిత్రం 'సారంగపాణి జాతకం. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. రూప కడువయూర్ హీరోయిన్. శ్రీదేవి మూవీస్ పతాకంపై రూపుదిద్దుకుంది. ఏప్రిల్ 25న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
2. సోదరా (Sodara)
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాలతో టాలీవుడ్ లో కామెడీ హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేశారు సంపూర్ణేష్ బాబు. ఆయన తాజాగా నటించిన చిత్రమే 'సోదరా'. ఈ సినిమాకు మన్మోహన్ మైనంపల్లి దర్శకత్వం వహించారు. సంజోష్ కీలక పాత్ర పోషించారు. కేన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నిర్మించారు. ఏప్రిల్ 25న థియేటర్లలో గ్రాండ్ విడుదల కాబోతోంది.

3. చౌర్య పాఠం (Chaurya Paatam)
ఇంద్ర రామ్, పాయల రాధాకృష్ణ నటించిన తాజా చిత్రం చౌర్య పాఠం. నిఖిల్ గొల్లమరి దర్శకత్వం వహించారు. నక్కిన నెరెటివ్స్ బ్యానర్ లో నిర్మించారు. ఈ చిత్రం కూడా ఏప్రిల్ 25నే గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
4.తుడరమ్ సినిమా (Thudarum Movie)..
మలయాళ సూపర్ స్టార్ మమ్ముటీ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'తుడరమ్'. ఈ చిత్రం ఈ నెల ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదల కాబోతోంది. అంటే రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. టాక్సీ డ్రైవర్ పాత్రలో మోహన్ లాల్ అలరించనున్నారు. తనకు తన కారు అంటే ఎంతో ఇష్టం. విధేయత, ప్రేమకు మధ్య సాగే క్రైమ్ డ్రామా ఇది. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. శోభన మోహన్ లాల్ సరస నటించింది. ఎం రెంజిత్ నిర్మించారు.
5. గ్రౌండ్ జీరో (Ground Zero)..
త్వరలో తెలుగు ప్రేక్షకులను పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంలో అలరించబోతున్నారు బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి. ఇక ప్రస్తుతం ఆయన బీఎస్ఎఫ్ ఆఫీసర్ గా నటించిన తాజా చిత్రం 'గ్రౌండ్ జీరో'. ఈ చిత్రం ఏప్రిల్ 25 థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. 2001 పార్లమెంట్ ఎటాక్ తర్వాత జరిగిన బీఎస్ఎఫ్ జవాన్ చేసిన రియల్ లైఫ్ ఈవెంట్స్, కథ ద్వారా తెరకెక్కించారు. థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది.
౩. ది అకౌంటెంట్ 2 (The Accountant 2)..
ఇంగ్లీష్ చిత్రాలను చూసే ప్రేక్షకులకు ఈ వారం 'ది అకౌంటెంట్ 2' పూర్తి వినోదాన్ని అందించ నుంది. బెన్ అఫ్లెక్ ఈ మూవీ మొదటి భాగంతో అదరగొట్టారు. గణితశాస్త్ర మేధావి. ఆయన తెలివి తేటలతో దుండగులను ఎలా మట్టుబెట్టారనేది కథ. ఈ చిత్రం ఏప్రిల్ 25న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
4. అన్ టిల్ డాన్ (Until Dawn)..
హారర్ర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ వారం థియేటర్ లో ఇంట్రెస్టింగ్ చిత్రంగా రాబోతోంది 'అన్ టిల్ డాన్'. హిట్ అనే వీడియో గేమ్ ఆధారంగా రూపొందించిన ఉత్కంఠభరితమైన హారర్ర్ ఫిల్మ్ ఇది. ఇది కూడా ఏప్రిల్ 25నే థియేటర్లలో విడుదల కాబోతుండటం విశేషం.
ఈ వారం ఓటీటీ లో విడుదల కాబోతున్న చిత్రాలివే..
5. ఎల్2 : ఎంపురాన్ (L2 : Empuraan)
మోహన్ లాల్ - పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ 'ఎల్2: ఎంపురాన్' థియేటర్లలో దుమ్ములేపిన సంగతి తెలిసిందే. ఇక ఓటీటీలోకి రాబోతోంది. ఏప్రిల్ 24 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది.
6. వీర ధీర శూర (Veera Dheera Soora)
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం 'వీర ధీర శూర : పార్ట్ 2'. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఓటీటీలోకి ఏప్రిల్ 24న విడుదల రాబోతోంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
7. మ్యాడ్ స్క్వేర్ (Mad Square)
సంగీత్ శోభర్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఏప్రిల్ 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఓటీటీ ప్రేక్షకులు వీక్షించేందుకు అందుబాటులో ఉంటుంది. అలాగే..
8. సైఫ్ అలీఖాన్ నటించిన 'జ్యూవెల్ థీఫ్' ఏప్రిల్ 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
9. అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ 'యూ సీజన్ 5' ఏప్రిల్ 24 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.
10. కన్నడ మిస్టరీ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా 'అయ్యాన మనె' ఏప్రిల్ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ వారం రీ రీలీజ్ సినిమాలు..
11. మహేశ్ బాబు భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 26న రీ రిలీజ్ కాబోతోంది.
12. రజనీకాంత్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ 'భాష' ఏప్రిల్ 25న తెలుగులో రీ రిలీజ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











