Top 3 Movies in OTT: ఓటీటీలో ఆ మూడు చిత్రాలదే హవా.. 2లో సలార్, మిగతా స్థానాల్లో ఏమున్నాయంటే?

ఓటీటీ వచ్చినప్పటి నుంచి అనేక సినిమాలు ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాయి. థియేటర్లలో విడుదల అయిన అతి తక్కువ కాలంలోనే ఓటీటీలోకి వచ్చేస్తూ సినీ ప్రియులను తెగ అలరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అనేక చిత్రాలు ఓటీటీలో సందడి చేస్తుండగా... కొన్ని సినిమాలు మాత్రం టాప్ లో ఉన్నాయి. ఈ సినిమాలు ఓటీటీలోకి వచ్చి చాలా రోజులే అవుతున్నా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ఓటీటీని షేక్ చేస్తున్న టాప్ 3 చిత్రాల లిస్టును విడుదల చేసింది. అందులో ఏయే చిత్రాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 1 సినిమాలో ఇప్పటికీ యానిమల్ లే కొనసాగుతోంది. డిసెంబర్ ఒకటో తేదీన యానిమల్ సినిమా థియేటర్లలో చాలా గ్రాండ్ గా విడుదల కాగా... జనవరి 26వ తేదీన ఓటీటీలోకి వచ్చేసింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను టి - సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో ప్యూర్ ఫాదర్ అండ్ సన్​ ఎమోషనల్​ డ్రామాగా రిలీజై సూపర్​ బ్లాక్ బస్టర్ హిట్​ను అందుకుంది.

 These Three Movies Get Super Response in OTT Check Details

ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి దగ్గరదగ్గర నెల రోజులు అవుతుండగా.. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. చాలా మంది ఈ చిత్రాన్ని చూస్తూనే ఉన్నారు. ఈ చిత్రం ఓటీటీలో అడుగు పెట్టినప్పటి నుంచి టాప్ 1లోనే నిలిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ అధ్భుతమైన చిత్రాన్ని మీరు చూసి ఉండకపోతే ఇప్పుడే వెళ్లి చూసేయండి. ఫ్యామిలీతో కలిసి వీక్షించి ఎంజాయ్ చేయండి.

 These Three Movies Get Super Response in OTT Check Details

ఇక టాప్ 2లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా నిలిచింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హాంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయగా... బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 200 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా 800 కోట్ల వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెల రోజులు కూడా తిరక్కముందే ఓటీటీలోకి వచ్చేసింది.

జనవరి 12వ తేదీన తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నే ప్లస్ హాట్ స్టార్ వేధికగా ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఈచిత్రాన్ని చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇక టాప్ 3లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదల చేయగా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా కనిపించి సందడి చేశారు. ఈ చిత్రం కూడా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది.

 These Three Movies Get Super Response in OTT Check Details

ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ప్లిక్స్ వేధికగా స్ట్రీమింగ్ అవుతుండగా.. పెద్ద ఎత్తునే స్పందన వస్తోంది. ఎవరూ ఊహించని స్థాయిలో వ్యూస్ ను దక్కించుకుంటూ టాప్ 3లో నిలిచిందీ చిత్రం. 150 కోట్ల బారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా 223.3కోట్ల వసూళ్లు రాబట్టుకుని బాక్సాఫీసును షేక్ చేసింది. ప్రస్తుతం ఓటీటీని షేక్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ టాప్ 3 చిత్రాలను మీరు చూసి ఉండకపోతే ఓసారి వెళ్లి చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X