OTT: ఓటీటీలోకి మరో బలగం టైప్ సినిమా... థియేటర్లో మిస్ అయినవారు చూసేయండి!

కంటెంట్ బాగుంటే.. చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా.. మన ప్రేక్షకులు హిట్ చేసేస్తారు. కథ, కథనం బాగుంటే.. అందులో ఏ హీర నటించారు.. ఏ డైరెక్టర్ తీశారు అనే విషయాలను పట్టించుకోరు. ఇక ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతారు. దీనికి ఎన్నో సినిమాలు ఉదహారణగా చెప్పుకోవచ్చు. ఇటీవల వచ్చిన బలగం ఈ కోవలోకే వస్తుంది. ఇక అదే టైపులో మరో సినిమా కూడా వచ్చింది. అదే నటుడు తీరువీర్ హీరోగా తెరకెక్కిన పరేషాన్. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

తెలంగాణ కుర్రాడు...: వీకెండ్ వచ్చిందంటే.. ఓటీటీలో మూవీస్ సందడి చేస్తుంటాయి. అందులో తెలంగాణ నటుడు తిరువీర్ నటించిన పరేషాన్. ఈ హీరో మొదట నాటకాలు వేస్తూ..వెండితెరపైకి జార్జ్ రెడ్డి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక పలాస, మల్లేశం సినిమాల్లో నటించి తనదైన ముద్రను చాటుకున్నాడు. ఇక ఇటీవల మసూధ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు ఈ హీరో. ఇక అదే జోష్ లో ఇటీవల ప్రేక్షకుల ముందుకు పరేషాన్ సినిమాతో ముందుకు వచ్చాడు.

Pareshan Movie

బలగం టైపు సినిమా...: పరేషాన్ సినిమాను మొదటి నుంచి బలగం టైపు సినిమా అంటూ ప్రచారం చేసుకున్నారు. ఇక రూపక్ రొనాల్డ్ సన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా ద‌గ్గుబాటి హీరో రానా సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఇక వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు విశ్వతేజ్‌ రాచకొండ, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మాతలు వ్యవహారించారు. తిరు వీర్‌ కు జోడీగా ఇందులో పావని కరణం హీరోయన్ గా నటించింది. బన్నీ అభిరన్‌, ముర‌ళీధ‌ర్ గౌడ్, శివరామ్, కెఎస్ఎల్ స్వామి తదితరులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు.

Pareshan Movie

పరేషాన్ స్ట్రీమింగ్...: ఇక పరేషాన్ సినిమా ఫన్ అండ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. జూన్ 2వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదికగా రిలీజ్ అయి అలరిస్తుంది. ఈ సినిమా హక్కులను కైవసం చేసుకున్న సోనిలీవ్ లో నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది అని చెప్పగా.. చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందుగానే ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Pareshan Movie

చూసేద్దామా...:పరేషాన్ స్ట్రీమింగ్ విషయాన్ని సోనిలివ్ తెలియజేస్తూ... ఇబ్బందులు 'పరేషాన్‌' అనే పేరు పెట్టుకుని వచ్చేశాయి. పల్లెటూరి జీవితంలోని హ్యాపీ నెస్‌ ను ఎంజాయ్ చేయండి. రానా దగ్గుబాటి సమర్పిస్తున్న 'పరేషాన్‌' ఇప్పుడు సోనీ లీవ్‌లో ప్రసారం అవుతుందంటూ" సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చింది. దీనితో పాటు ఓ వీడియోను జత చేసింది సోనిలీవ్. ఇక మీరు గనుక ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయి ఉంటే.. హ్యాపీగా ఓటీటీలో చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X