Pareshan OTT: ఓటీటీలోకి అప్పుడే రానా దగ్గుబాటి 'పరేషాన్'.. విడుదలకు ముందే డీల్ ఫిక్స్!

చిన్న పాత్రలు చేస్తూ మినీ హీరోగా పాపులర్ అయ్యాడు తిరువీర్ (Thiruveer). 'సిన్' వంటి వెబ్ సిరీసులతోపాటు, 'జార్జ్ రెడ్డి', 'మసుదా' లాంటి హారర్ ఫిల్మ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తాజాగా 'పరేషాన్' (Pareshan Movie) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తిరువీర్.

ఆయన ప్రధాన పాత్ర పోషించగా.. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహిరించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ సినిమాకు రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించారు. జూన్ 2 అంటే ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పరేషాన్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదిపై ఆసక్తి నెలకొంది.

Thiruveer Pavani Karanam Pareshan OTT Rights To Sony Liv

యువ నటుడు తిరువీర్ చేసింది కొన్ని సినిమాలు అయినా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ తన నటనేంటో నిరూపించుకున్నాడు. ఇక మసూద సినిమాతో భయపెట్టడమే కాకుండా ఘన విజయం సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తిరువీర్ తాజాగా నటించిన సినిమా పరేషాన్. జూన్ 2న విడుదలైన ఈ మూవీ ప్రమోషన్స్ బాగానే నిర్వహించారు. ముఖ్యంగా పరేషాన్ ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

ఇక తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు స్పందన బాగానే వస్తుంది. మూవీపై రివ్యూలు కూడా పాజిటివ్ గానే ఉంటున్నాయి. తెలంగాణ నేటివిటీతో ఫన్ క్రియేట్ చేశారని సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే పరేషాన్ మూవీ విడుదలకు ముందే ఓటీటీ డీల్ క్లోజ్ అయింది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ (Sony Liv) పరేషాన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను మంచి ధరకు సొంతం చేసుకుంది. ఈ మూవీ రెస్పాన్స్ బట్టి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయనున్నారు.

Thiruveer Pavani Karanam Pareshan OTT Rights To Sony Liv

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు మూవీ విడుదలైన నెలకు అంటే జూలై మొదటి వారంలో పరేషాన్ సినిమా ఓటీటీలో సందడి చేసే అవకాశం ఉంది. కాగా.. ఈ మూవీకి దర్శకత్వం వహించిన రూపక్ రోనాల్డ్ సన్ ఇదివరకు సంపూర్ణేష్ బాబుతో కొబ్బరి మట్ట తెరకెక్కించారు. ఇందులో తిరువీర్ సరసన పావని కరణం నటించారు. ఆమె ఇంతకుముందు హిట్ 2 సినిమాతోపాటు పరంపర 2, ది బేకర్ అండ్ ది బ్యూటి, ది సిన్ చిత్రాల్లో నటించింది. వాల్తేరు ప్రొడక్షన్స్ పతాకంపై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించగా.. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో రానా దగ్గుబాటి సమర్పణలో రిలీజైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X