OTTలోకి వచ్చేసిన క్రేజీ సినిమా.. హిట్ మూవీ తరహాలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
చిన్న పాత్రలు చేస్తూ మినీ హీరోగా పాపులర్ అయ్యాడు తిరువీర్ (Thiruveer). 'సిన్' వంటి వెబ్ సిరీసులతోపాటు, 'జార్జ్ రెడ్డి', 'మసుదా' లాంటి హారర్ ఫిల్మ్ తో తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల 'పరేషాన్' (Pareshan Movie) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ అప్ కమింగ్ హీరో.
అయితే ఈ సినిమా జూన్ 2న థియేటర్లలో విడుదలైంది. కానీ, కామెడీ డ్రామాగా రూపొందిన దీనికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయినా చాలా రోజుల తర్వాత ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఇంతకీ పరేషాన్ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతోందన్న వివరాల్లోకి వెళితే..

రీసెంట్ మూవీ: యువ నటుడు తిరువీర్ చేసింది కొన్ని సినిమాలు అయినా తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ తన నటనేంటో నిరూపించుకున్నాడు. ఇక హారర్ మూవీగా వచ్చిన మసూదతో భయపెట్టడమే కాకుండా ఘన విజయం సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తిరువీర్ రీసెంట్ గా నటించిన సినిమా పరేషాన్.

కొబ్బరి మట్ట డైరెక్టర్: పల్లెటూరులో కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహిరించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ సినిమాకు రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించారు. ఆయన ఇంతకుముందు సంపూర్ణేష్ బాబుతో కొబ్బరి మట్ట సినిమాను తెరకెక్కించారు.

తెలంగాణ నేటివిటీ: ట్రైలర్, టీజర్, కామెడీ, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది పరేషాన్ సినిమా. అయితే జూన్ 1న విడుదలైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. మొదట్లో స్పందన బాగానే ఉన్న తర్వాత కాలంలో అంటే ఫుల్ రన్ లో అంతగా ఆకట్టుకోలేదు. మూవీపై రివ్యూలు పాజిటివ్ గా వచ్చినప్పటికీ లాంగ్ రన్ లో తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది పరేషాన్ సినిమా. తెలంగాణ నేటివిటీతో ఫన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించిన మేకర్స్ కు ఆశించిన ఫలితం దక్కలేదు.
ఓటీటీపై ఆధారపడి: అలా మిశ్రమ స్పందన తెచ్చుకున్న పరేషాన్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వస్తుందని అంతా భావించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా, ఒక సక్సెస్ మూవీ తరహాలో రెండు నెలలకు ఓటీటీలో ప్రత్యక్షమైంది. పరేషాన్ సినిమా విడుదలకు ముందే డీల్ కుదుర్చుకుంది ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ (Sony Liv). థియేటర్ తర్వాత ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేయాలన్ని ఆ ప్లాట్ ఫామ్ మేనెజ్ మెంట్ పై ఆధారపడి ఉంటుంది.

రెండు నెలల్లో: అందుకే చాలా కాలం అంటే రెండు నెలల గ్యాప్ తర్వాత పరేషాన్ సినిమాను డిజిటల్ స్క్రీనింగ్ చేసింది సోని లివ్. ఆగస్టు 4 అంటే నేటి నుంచి సోని లివ్ లో పరేషాన్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయినవాళ్లు సోనీ లివ్ లో ఎంచక్కా చూసేయొచ్చు.
పావని కరణం సినిమాలు: పరేషాన్ సినిమాలో తిరువీర్ సరసన పావని కరణం నటించారు. ఆమె ఇంతకుముందు హిట్ 2 సినిమాతోపాటు పరంపర 2, ది బేకర్ అండ్ ది బ్యూటి, ది సిన్ చిత్రాల్లో నటించింది. వాల్తేరు ప్రొడక్షన్స్ పతాకంపై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించగా.. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో రానా దగ్గుబాటి సమర్పణలో రిలీజైంది.


Click it and Unblock the Notifications











