ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోయే ఆసక్తికరమైన సినిమాలు ఇవే.. ఆ మూవీపైనే అందరి ఫోకస్!
ఈమధ్యకాలంలో ఎంటర్‌టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి ఓటీటీలు. వారం వారం పదుల సంఖ్యలో కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు సినీ ప్రేక్షుకలను ఆకట్టుకుంటూనే ఉంటున్నాయి. ఒకటి కాకపోతే మరొకటి అంటూ బోలెడన్నీ సినిమాలు వస్తున్నాయి. ఓటీటీలు వచ్చిన తర్వాత వినోదానికి కొదవ లేదనే చెప్పాలి. అంతగా చేరువ అయిపోయి అలరిస్తున్నాయి ఓటీటీ సినిమాలు. ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ లు ఏవో ఓ లుక్కేద్దాం.
ఈ వారం చాలా చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ కానున్న ఆ చిత్రాలు, సిరీసులు ఏంటంటే.. ఈ ఏడాది ప్రథమార్థంలో దాస్ కా ధమ్కీ సినిమాతో సినీ ప్రేక్షకులను పలకరించాడు విశ్వక్ సేన్. ద్విపాత్రాభినయం చేసి తన నటనతో ఆకట్టుకున్నాడు. విశ్వక్ సేన్ యాక్టింగ్ కు మరోసారి మంచి మార్కులు పడ్డాయి. ఇందులో నివేతా పేతురాజ్ చాలా గ్లామరస్ గా కనిపించి కవ్వించింది. ఈ మూవీ ఆహాలో ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ కానుంది.

ఎన్నో అంచనాల మధ్య కేజీఎఫ్ తర్వాత ఆ రేంజ్ లో కన్నడ సినీ ఇండస్ట్రీ నుండి వచ్చిన మూవీ కబ్జా. ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ లాంటి సూపర్ స్టార్స్ నటించిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ కానుంది.
రవిబాబు దర్శకత్వంలో పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ 'అసలు'. అవును లాంటి సూపర్ హిట్ తర్వాత రవిబాబు, పూర్ణ కాంబోలో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా ఈటీవీ విన్ లో ఏప్రిల్ 13న విడుదల కానుంది. పెద్దగా ప్రచారం లేకుండానే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏప్రిల్ 13వ తేదీన 'ఓ కల' అనే తెలుగు సినిమా రిలీజ్ కానుంది. ఇక నెట్ ఫ్లిక్స్ లో ద లాస్ట్ కింగ్డమ్: సెవన్ కింగ్స్ మస్ట్ డై ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. జీ5లో ప్రణయ విలాసం అనే మలయాళ మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











